2027లో బంగ్లా ఆతిథ్యం
2018 ఎడిషన్‌లో ఆసియా కప్ హోస్టింగ్ హక్కులను భారత్... యూఏఈకి ఇచ్చింది. బంగ్లాదేశ్ కూడా ఆరోసారి ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. బంగ్లాదేశ్‌లో 1998, 2000, 2012, 2014, 2016లో ఆసియా కప్ జరిగింది. 2027లోనూ బంగ్లాదేశ్‌లో ఆసియా కప్ నిర్వహించనున్నారు. ఆసియా కప్‌తో పాటు, 2025 మహిళల ప్రపంచ కప్, 2026 పురుషుల T20 ప్రపంచ కప్, 2029 పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీతో సహా అనేక ఇతర ప్రధాన టోర్నమెంట్‌లకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. బంగ్లాదేశ్ ఈ ఏడాది చివర్లో 2024 మహిళల T20 ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. 2031 పురుషుల వన్డే ప్రపంచ కప్‌కు రెండు దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 2025, 2027 ఆసియా కప్ టోర్నమెంట్‌లు క్రికెట్ క్యాలెండర్‌లో చాలా ముఖ్యమైనవని... భారత్ , బంగ్లాదేశ్‌లు వీటిని సమర్థంగా నిర్వహిస్తాయని ఆసియా క్రికెట్ కౌన్సిల్ స్పష్టం చేసింది.
ఇన్నేళ్లు ఎందుకు నిర్వహించలేదంటే..?
ఆసియా కప్ అంటే ప్రధాన పోరు భారత్-పాకిస్థాన్(Ind Vs Pak) మధ్యే ఉంటుంది. ఈ రెండు జట్లు తలపడితే చూడాలని ప్రతీ అభిమాని కోరుకుంటాడు. అయితే ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఒక దేశంలో మరో దేశం పర్యటిచండం లేదు. అందుకే ఆసియా కప్‌ను ఎక్కువ శాతం బంగ్లాదేశ్, శ్రీలంకల్లోనే నిర్వహిస్తూ వస్తున్నారు. గత ఏడాది ఆసియా కప్‌కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చింది. అయితే భారత్ ఈ మ్యాచ్‌లకు వెళ్లకపోవడంతో... శ్రీలంకలో టీమిండియా మ్యాచ్‌లు నిర్వహించారు. అఫ్ఘనిస్తాన్, భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌తో పాటు క్వాలిఫికేషన్‌లో ఆడి వచ్చిన జట్లు ఈ ఆసియా కప్‌లో తలపడతాయి. గత ఏడాది ఆసియా కప్‌ను శ్రీలంకను ఓడించి భారత్ గెలుచుకుంది