వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి వన్డే గురువారం జరుగుతోంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో వెస్టిండీస్ మొదట బ్యాటింగ్‌కు దిగనుంది.


ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ ‘మేం మొదట ఫీల్డింగ్ చేయనున్నాం. దీనికి ప్రత్యేకమైన కారణం అంటూ ఏమీ లేదు. కొత్తగా కొన్ని ప్రయత్నించి ఒక జట్టుగా మేం ఏ స్థాయిలో ఉన్నామో తెలుసుకోవాలని అనుకుంటున్నాం. ప్రపంచకప్‌కు చాలా క్లియర్ మైండ్‌సెట్‌తో రావాలనేది మా లక్ష్యం. దానికి ఫలితాలు కూడా చాలా ముఖ్యం. కొన్ని సార్లు వేర్వేరు ఆటగాళ్లతో ఆడటానికి ప్రయత్నిస్తాం. కానీ అంతిమ లక్ష్యం మాత్రం విజయమే. ఈ మ్యాచ్‌లో నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగనున్నాం.’ అన్నాడు. 


వెస్టిండీస్‌తో ఇప్పటికే జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ 1-0తో విజయం సాధించింది. మొదటి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 141 పరుగులతో గెలిచింది. వర్షం కారణంగా రెండో టెస్టు డ్రాగా ముగిసింది. ఈ సిరీస్‌లో విరాట్, రోహిత్, యశస్వి జైస్వాల్ సెంచరీలు సాధించారు.


వెస్టిండీస్ తుది జట్టు
షాయ్ హోప్ (కెప్టెన్, వికెట్ కీపర్), కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, అలిక్ అథానాజ్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మాన్ పావెల్, రొమారియో షెపర్డ్, యానిక్ కరియా, డొమినిక్ డ్రేక్స్, జేడెన్ సీల్స్, గుడాకేష్ మోటీ


భారత్ తుది జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్