IND vs SL 1st Test: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక జట్టును తక్కువ స్కోరుకు పరిమితమైంది. తొలి ఇన్నింగ్స్ లంక జట్టు 174 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా స్పిన్‌కు లంకేయులు విలవిల్లాడిపోయారు. జడేజా 5 వికెట్ల ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో భారత్ కు 400 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అశ్విన్, జస్ప్రిత్ బుమ్రా చెరో 2 వికెట్లు తీయగా, పేసర్ షమీకి ఒక వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 574/8 వద్ద డిక్లేర్ చేసింది.
లంకను కట్టడి చేసిన జడేజా
కరుణరత్నేతో కలిసి లహిరు తిరిమన్నే(17) శుభారంభం అందించాడు. తొలి వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యం తరువాత అశ్విన్.. తిరిమన్నేను పెవిలియన్ చేర్చాడు. మరో ఓపెనర్ కరుణరత్నే(28)ను జడేజా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. నిస్సంక (61 నాటౌట్) హాఫ్ సెంచరీతో ఆదుకోవడంలో లంక ఆ మాత్రం పరుగులైనా చేసింది. అతడికి మాథ్యూస్ (22), చతిత్ అసలంక (29) కాసేపు తోడుగా నిలవడంతో లంక స్కోరును 150 దాటించాడు నిస్సంక.
14 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు..
లంక ఓ దశలో 160 పరుగులకు 4 వికెట్లుగా ఉంది. కానీ జడేజా స్పిన్ మాయాజాలంతో లంక చివరి 6 వికెట్లను కేవలం 14 పరుగుల తేడాతో కోల్పోయింది. ఏ దశలోనూ లంకకు కోలుకునే ఛాన్స్ ఇవ్వలేదు జడేజా, ఇతర భారత బౌలర్లు. లంక చివరి నలుగురు ఆటగాళ్లు ఖాతా తెరవకుండా డకౌట్‌గా వెనుదిరగడంతో భారత్ కు ఏకంగా 400 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. రవీంద్ర జడేజా అజేయ భారీ శతకం (175 నాటౌట్) వీర విహారానికి, రిషబ్ పంత్ (96), అశ్విన్ (61), హనుమ విహారి (58) హాఫ్ సెంచరీలు తోడు కావడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను 574/8కి డిక్లేర్ చేసి ఆటపై పట్టు సాధించింది.
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో రవీంద్ర జడేజా 175 పరుగుల వద్ద ఉన్నప్పుడు భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. దాని వెనక కారణాన్ని రవీంద్ర జడేజా బయటపెట్టాడు. ‘ఇన్నింగ్స్ డిక్లరేషన్ గురించి డ్రెస్సింగ్ రూం నుంచి నాకు ముందుగానే మెసేజ్ వచ్చింది. నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పిచ్‌పై బంతి తిరగడం మొదలైంది. దాంతోపాటు అదనపు బౌన్స్ కూడా లభిస్తుంది. వికెట్ తన ట్రిక్స్ ప్లే చేయడం ప్రారంభించిందని, శ్రీలంకను బ్యాటింగ్‌కు దించవచ్చని నేను సమాచారం పంపాను.’ అని ఆట అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జడేజా తెలిపాడు.
Also Read: Ravindra Jadeja: ఆ నిర్ణయం నాదే - జడేజా షాకింగ్ కామెంట్స్!