India vs New Zealand Live Streaming:
న్యూజిలాండ్‌తో మూడో వన్డేకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్ గెలిచిన ఊపులో ఉంది. ఆఖరి వన్డేలోనూ కివీస్‌ను ఓడించి క్లీన్‌స్వీప్ చేసేందుకు పట్టుదలతో ఉంది. హైదరాబాద్‌లో జరిగిన తొలి వన్డే శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. రెండో వన్డేలో పేసర్లు చెలరేగారు. దాంతో మూడో మ్యాచుపై ఆసక్తి నెలకొంది. ఈ పోరు వేదిక, టైమ్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు మీ కోసం!
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మూడో వన్డే ఎప్పుడు జరుగుతుంది?
భారత్ vs న్యూజిలాండ్ మూడో వన్డే జనవరి 24వ తేదీన మంగళవారం జరగనుంది.
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మూడో వన్డే ఏ సమయానికి ప్రారంభమవుతుంది?
భారత్ vs న్యూజిలాండ్ మూడో వన్డే మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది.
ఇండియా vs న్యూజిలాండ్ మూడో వన్డే ఎక్కడ జరుగుతుంది?
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మూడో వన్డే జరగనుంది.
ఇండియా vs న్యూజిలాండ్ మూడో వన్డే ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడాలి?
ఇండియా vs న్యూజిలాండ్ మూడో వన్డే స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.
భారత్ vs న్యూజిలాండ్ మూడో వన్డే ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడాలి?
భారత్ vs న్యూజిలాండ్ మూడో వన్డే లైవ్ స్ట్రీమింగ్ డిస్నీప్లస్ హాట్‌స్టార్ యాప్‌లో చూడవచ్చు.
భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్
న్యూజిలాండ్ వన్డే జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మిషెల్ సాంట్నర్, హెన్రీ షిప్లీ, ఇష్ సోధి