దీపక్ హుడా అద్భుతమైన బ్యాటింగ్‌తో ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అదరగొట్టాడు. ఐర్లాండ్ ముందు నిర్ణీత 20 ఓవర్లలో 226 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది టీమిండియా. దీపక్ హుడా, సంజూ శాంసన్, ఇద్దరు తమదైన బ్యాటింగ్‌తో ఐర్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. దీపక్ హుడా 57 బంతుల్లో 104 పరుగులు చేసి లిటిల్ బౌలింగ్‌లో మెక్‌బ్రైన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదరిగాడు. సంజూ శాంససన్ అడైర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. శాంసన్ 42 బంతుల్లో 77 పరుగులు చేశాడు.
టాస్ ఓడిపోయిన ఐర్లాండ్ బౌలింగ్‌ను ఎంచుకుంది. క్రీజ్‌లోకి వచ్చినప్పటి నుంచి సంజూ శాంసన్ మంచి దూకుడుగా కనిపించాడు. 13 పరుగుల వద్ద ఇషాన్ కిషన్ ఔటైనప్పటికీ భారత్ అధైర్య పడలేదు. శాంసన్‌కు తోడుగా వచ్చిన దీపక్ హుడా ఐర్లాండ్ బౌలర్లతో ఆడుకున్నారు.
189 పరుగుల వరకు వీళ్లద్దరి జోడీ విడదీయడానికి ఐర్లాండ్ చాలా ట్రై చేసింది. 16.2 ఓవర్ వద్ద సంజూ శాంసన్ పరుగుల వేగాన్ని పెంచే క్రమంలో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత భారత్ వరుసగా వికెట్లు పారేసుకుంది.
తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కాసేపు బ్యాట్ ఝలిపించినా తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. ఐదు బంతుల్లో పదిహేను పరుగులు చేసి ఔట్ అయ్యాడు. వరుసగా దీపక్ హుడా, సూర్యకుమార్ వికెట్లను లిటిల్ తీసుకున్నాడు. సూర్యకుమార్ ఔటైన ఓవర్‌లోనే దీపక్ హుడా ఔట్ అయ్యాడు. తర్వాత వచ్చిన హార్దిక పాండ్య కాస్త బ్యాట్‌తో రఫ్ ఆడించాడు కానీ.. అవతలి ఎండ్ వైపు ఉన్న వాళ్లు మాత్రం ఒక్కొక్కరుగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్ ఎలాంటి పరుగులు చేయకుండానే వచ్చిన తొలి బంతికే అవుట్ వెళ్లిపోయారు. ఇంతలో 20 ఓవర్లు పూర్తయ్యాయి. దీంతో ఐర్లాండ్ ముందు 226 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఉంచుంది.