IND vs AUS T20: రేపటి నుంచి భారత్- ఆస్ట్రేలియా టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే మొదటి మ్యాచ్ కోసం మొహాలీ చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్ ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ గురించి ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
విరాట్ ఎప్పటికీ గొప్ప ఆటగాడేనని ఫించ్ ప్రశంసించాడు. పదిహేనేళ్లుగా కోహ్లీ సాధించిన విజయాలు అతడినెప్పటికీ ఉత్తమంగా నిలబడతాయని కితాబిచ్చాడు. 71 సెంచరీలు కొట్టడమంటే మాటలు కాదని.. ఎంతో కృషి, పట్టుదల ఉంటే తప్ప అది సాధ్యం కాదని ఫించ్ అన్నాడు. అతడితో ఆడేటప్పుడు పక్కా ప్రణాళికతో వెళ్లాలని స్పష్టం చేశాడు. టీ20 క్రికెట్ కు అనుగుణంగా తనని తాను మలుచుకున్న విధానం ప్రశంసించ తగినదని అన్నాడు. అతడో గొప్ప ఆటగాడని అన్నాడు.
గత కొంతకాలంగా సెంచరీ చేయలేక ఇబ్బంది పడ్డ విరాట్ కోహ్లీ.. ఆసియా కప్ లో టీ20ల్లో తన మొదటి శతకాన్ని అందుకున్నాడు. అలాగే 71 వ అంతర్జాతీయ సెంచరీ సాధించాడు.
రేపటి నుంచే టీ20 సిరీస్
సెప్టెంబర్ 20 (మంగళవారం) నుంచి ఆసీస్ తో టీ20 సిరీస్ మొదలుకానుంది. బ్యాటింగ్ లో రోహిత్, రాహుల్ లు భారీ ఇన్నింగ్సులు ఆడాల్సిన అవసరముంది. కోహ్లీ ఆసియా కప్ తో ఫామ్ లోకి వచ్చాడు. అది కొనసాగించాలి. సూర్యకుమార్, పంత్, హార్దిక్ పాండ్యాలు పెద్ద ఇన్నింగ్సులు ఆడాలి. ఇక బౌలింగ్ విషయానికొస్తే స్టార్ పేసర్ బుమ్రా జట్టుతో చేరడం పెద్ద బలం. అతనితోపాటు హర్షల్ పటేల్ అందుబాటులో ఉన్నాడు. భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్ లతో పేస్ దళం బలంగానే కనిపిస్తోంది. అక్షర్ పటేల్, యుజువేంద్ర చహాల్, రవిచంద్రన్ అశ్విన్ లు స్పిన్ భారం మోయనున్నారు.
భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, యుజువేంద్ర చహాల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఉమేశ్ యాదవ్, దీపక్ చాహర్.
ఆస్ట్రేలియా జట్టు
ఆరోన్ ఫించ్ (కెప్టెన్), సీన్ అబాట్, ఆస్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్ వుడ్, జోష్ ఇగ్లిస్, గ్లెన్ మాక్స్ వెల్, కేన్ రిచర్డ్ సన్, డానియల్ సామ్స్, స్టీవ్ స్మిత్, అడమ్ జంపా, మాథ్యూ వేడ్.