WTC Final Playing XI, Ravichandran Ashwin: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అదే సమయంలో ఈ మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ లేకుండానే భారత జట్టు మైదానంలోకి దిగింది. రవిచంద్రన్ అశ్విన్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చకుండా రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయం సరైనదేనా? వాస్తవానికి కంగారూ జట్టు టాప్-7 బ్యాటర్లలో నలుగురు లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడితే అతను ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌కు పెద్ద సవాలుగా మారేవాడు.
రోహిత్ శర్మ పెద్ద తప్పు చేశాడా?
లెఫ్ట్‌హ్యాండర్ బ్యాట్స్‌మెన్‌పై రవిచంద్రన్ అశ్విన్ ప్రమాదకరంగా మారుతున్నాడని గణాంకాలు చెబుతున్నాయి. ఇది కాకుండా ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌ను రవిచంద్రన్ అశ్విన్ నిరంతరం ఇబ్బంది పెట్టాడు.
ఎడమచేతి వాటం ఆటగాళ్లతో పాటు, స్టీవ్ స్మిత్ వంటి అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లకు రవి అశ్విన్ ఎప్పుడూ పెద్ద సవాలుగా నిలిచాడు. ఇది మాత్రమే కాదు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ బౌలర్లలో రవి అశ్విన్ ఒకరు. దీంతోపాటు అవసరమైనప్పుడు అద్భుతమైన బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. అయితే అతను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగం కాదు. కాబట్టి భారత జట్టుకు ఇది లోటుగా మారుతుందా? భారత కెప్టెన్ రోహిత్ శర్మ, టీమ్ మేనేజ్‌మెంట్ ఈ విషయంలో పెద్ద తప్పు చేశారా?
మరోవైపు ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా దూసుకుపోతుంది. ఆస్ట్రేలియా ఎడమ చేతి వాటం బ్యాటర్ ట్రావిస్ హెడ్ (107 బ్యాటింగ్: 120 బంతుల్లో, 15 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్టీవ్ స్మిత్ (72 బ్యాటింగ్: 173 బంతుల్లో, 11 ఫోర్లు)అతనికి చక్కటి సహకారం అందిస్తున్నాడు. వీరు నాలుగో వికెట్‌కు ఇప్పటికే 171 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా 70 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. మొదటి రోజు ఇంకా 20 ఓవర్ల ఆట మిగిలి ఉంది.
టీమ్ ఇండియా తుది జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా తుది జట్టు
డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్