భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ లో అద్భుత సెంచరీ తో ఆసీస్ ను గెలిపించిన మాక్స్ వెల్ మరోసారి అలాంటి ఇన్నింగ్స్ ఆడాడు. గెలుపు దాదాపు అసాధ్యం అనుకున్న స్థితిలో విధ్వంసకర సెంచరీ తో కంగారూ లకు చీర స్మరణీయ విజయం అందించాడు. చివరి ఓవర్ లో 21 పరుగులు అవసరం కాగా ఒక సిక్స్, మూడు ఫోర్ లతో మాక్స్ వెల్ ఆస్ట్రేలియా ను గెలిపించాడు, అంతకు ముందు రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసకర శతకంతో తొలుత భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. అనంతరం మాక్స్ వెల్ మెరుపు ఇన్నింగ్స్ తో కంగారులు విజయం సాధించారు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా... టీమ్ ఇండియాను బాటింగ్ కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్ లో భారత్ కు శుభారంభం దక్కలేదు. 14 పరుగుల వద్ద యశస్వి జైస్వాల్ వెనుదిరిగాడు. ఆరు బంతుల్లో ఆరు పరుగులు చేసి...జైస్వాల్ అవుట్ అయ్యాడు.. స్కోర్ బోర్డుపై మరో 10 పరుగుల చేరాయో లేదో...మంచి ఫామ్ లో ఉన్న ఇషాన్ కిషన్ కూడా వెనుదిరిగాడు. 5 బంతులు ఆడి ఒక్క పరుగు కూడా చేయకుండా ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాడు. అనంతరం రుతురాజ్ గైక్వాడ్.. సూర్య కుమార్ యాదవ్ టీం ఇండియాను ఆదుకున్నారు... ఓ వైపు రెండు వికెట్స్ పడ్డా రుతురాజ్ ఆత్మవిశ్వాసంతో బాటింగ్ చేసాడు.. మరోవైపు సారధి సూర్య కుమార్ యాదవ్ ధాటిగా బాటింగ్ చేశాడు.. వీరిద్దరూ కంగారూ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు... ముఖ్యంగా సూర్యా అద్భుతమైన రెండు సిక్సర్లు కొట్టాడు.., ఈ క్రమంలో 29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేసి సూర్య అవుట్ అయ్యాడు.సూర్య అవుట్ అయ్యాక తిలక్ వర్మతో కలిసి రుతురాజ్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. ఈ మ్యాచ్ లో రాణించకపోతే వేటు తప్పదన్న ఊహాగానాలు మధ్య తిలక్ వర్మ పర్వాలేదనిపించాడు. 24 బంతులలో 4 ఫోర్ లతో 31 పరుగులు చేశాడు.
223 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కు మెరుపు ఆరంభం దొరికింది. ట్రావిస్ హెడ్, హార్డీ నాలుగు ఓవర్ లకే47 పరుగులు జోడించారు.. 47 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్ తర్వాత వరుసగా వికెట్స్ కోల్పోయింది. కానీ మాక్స్ వెల్ ఒంటరి పోరాటం చేశాడు.. సాధించాల్సిన రన్ రేట్ భారీగా ఉన్నా క్రీజ్ లో మాక్స్ వెల్ ఉండటంతో కంగారులు చివరి ఓవర్ వరకు రేస్ లొనే ఉన్నారు. చివరి ఓవర్ లో 21 పరుగులు అవసరంకాగా ఒక సిక్స్, మూడు ఫోర్ లతో మాక్స్ వెల్ ఆస్ట్రేలియా ను గెలిపించాడు. భారత బౌలర్ లలో ప్రసీద్ కృష్ణ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 4 ఓవర్లలో 68 పరుగులు ఇచ్చాడు కానీ ఒక్క వికెట్ కూడా తియ్యలేదు. రవి విష్ణోయ్ 2, హర్ష దీప సింగ్ 1, ఆవేష్ ఖాన్ 1, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు . 5 మ్యాచ్ ల సీరీస్లో టీం ఇండియా 2, ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ గెలిచాయి. మరో 2 మ్యాచ్ లు ఇంకా మిగిలి ఉన్నాయి.