ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో యువ భారత్ భారీ స్కోర్ చేసింది. రూతురాజ్ గైక్వాడ్ అద్భుత శతకం తో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం54 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో రుతురాజ్ శతకాన్ని బాదాడు. మొదట నిదానంగా ఆడిన రుతురాజ్ క్రీజులో కుదురుకున్నాక విధ్వంసం సృష్టించాడు... 15 ఓవర్ల తర్వాత దొరికిన బంతిని దొరికినట్టు బాదాడు... మొత్తం57 బంతుల్లో రుతురాజ్ 13 ఫోర్ లు, 7 సిక్స్ లతో 123 పరుగులు చేశాడు


ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా... టీమ్ ఇండియాను బాటింగ్ కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్ లో   భారత్ కు  శుభారంభం దక్కలేదు. 14 పరుగుల వద్ద యశస్వి జైస్వాల్ వెనుదిరిగాడు. ఆరు బంతుల్లో ఆరు పరుగులు చేసి...జైస్వాల్ అవుట్ అయ్యాడు.. స్కోర్ బోర్డుపై మరో 10 పరుగుల చేరాయో లేదో...మంచి ఫామ్ లో ఉన్న ఇషాన్ కిషన్ కూడా వెనుదిరిగాడు. 5 బంతులు ఆడి ఒక్క పరుగు కూడా చేయకుండా ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాడు. అనంతరం రుతురాజ్ గైక్వాడ్.. సూర్య కుమార్ యాదవ్ టీం ఇండియాను ఆదుకున్నారు... ఓ వైపు రెండు వికెట్స్ పడ్డా రుతురాజ్ ఆత్మవిశ్వాసంతో బాటింగ్ చేసాడు.. మరోవైపు సారధి సూర్య కుమార్ యాదవ్ ధాటిగా బాటింగ్ చేశాడు.. వీరిద్దరూ కంగారూ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు... ముఖ్యంగా సూర్యా అద్భుతమైన రెండు సిక్సర్లు కొట్టాడు.., ఈ క్రమంలో  29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేసి సూర్య అవుట్ అయ్యాడు.సూర్య అవుట్ అయ్యాక తిలక్ వర్మతో కలిసి రుతురాజ్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. ఈ మ్యాచ్ లో రాణించకపోతే వేటు తప్పదన్న  ఊహాగానాలు మధ్య తిలక్ వర్మ పర్వాలేదనిపించాడు. 24 బంతులలో 4 ఫోర్ లతో 31 పరుగులు చేశాడు. 


భారత్‌ వేదికగా జరుగుతున్న అయిదు మ్యాచ్‌లో టీ 20 సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఆరుగురు ఆటగాళ్లు సిరీస్‌ మధ్యలోనే స్వదేశానికి తిరుగు పయనమయ్యారు. ఓపెనర్‌ స్టీవ్‌ స్మిత్‌, స్టార్‌ బౌలర్‌ ఆడమ్‌ జంపా ఇప్పటికే స్వదేశానికి చేరుకున్నారు. ఈరోజు( మంగళవారం) జరిగేమూడో మ్యాచ్‌ ఆడిన తర్వాత గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, స్టాయినిస్‌, ఇంగ్లిస్‌, అబాట్‌ కూడా స్వదేశానికి వెళ్లిపోనున్నారు. పని భారం కారణంగా వారికి విశ్రాంతినిచ్చినట్టు క్రికెట్‌ ఆస్ట్రేలియా తెలిపింది. మూడో టీ20 సమయంలో వీరు నలుగురు ఇండియాలోనే ఉంటున్నా మ్యాచ్ మాత్రం ఆడడం లేదని కంగారు క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. స్వదేశానికి వెళ్లిన స్మిత్, జంపా స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఫిలిప్స్, బిగ్ హిట్టర్ అయిన్ బెన్ మెక్‌డెర్మాట్ జట్టులో చేరారు. రాయ్‌పూర్‌లో జరిగే నాలుగో టీ20 మ్యాచ్‌కు ముందు బెన్ ద్వార్షుయిస్, స్పిన్నర్ క్రిస్ గ్రీన్ జట్టులో చేరుతారని ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. మొత్తంగా ఆరుగురు ఆటగాళ్లు స్వదేశానికి వెళ్తున్నప్పటికీ వారి స్థానంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నలుగురిని మాత్రమే జట్టులోకి తీసుకుంది.  ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌పై వీరోచిత శతకం చేసిన ట్రావిస్ హెడ్‌ మాత్రం జట్టుతోపాటే కొనసాగనున్నాడు. ఆసీస్‌ జట్టు మేనేజ్‌మెంట్‌ నిర్ణయాన్ని వన్డే కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ సమర్థించాడు. టీ20 సిరీస్‌ మధ్యలో సహచరులు వెనక్కి రావడానికి మద్దతు పలికాడు. ప్రపంచకప్‌ జైత్రయాత్ర తర్వాత తమ ఆటగాళ్లకు విశ్రాంతి కావాలని పేర్కొన్నాడు. ప్రపంచకప్ ఫైనల్ తర్వాత వారం రోజులపాటు విశ్రాంతి తీసుకున్న శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్‌ తర్వాత తిరిగి జట్టులోకి రానున్నాడు. రాయ్‌పూర్, బెంగళూరుల్లో జరిగే చివరి రెండు మ్యాచుల్లో అయ్యర్‌ బరిలోకి దిగుతాడు.