ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ 20 సిరీస్‌లో యువ భారత్ జోరు మాములుగా లేదు. వరుసగా రెండు విజయాలు సాధించి మంచి ఊపు మీద ఉంది. ఇప్పటివరకూ జరిగిన రెండు టీ 20ల్లోనూ యువ భారత జట్టు రెండుసార్లు 200కుపైగా పరుగులు సాధించింది. భారత టాపార్డర్‌ రాణిస్తుండడంతో టీమిండియా భారీ స్కోర్లు నమోదు చేస్తోంది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతున్న ఆటగాళ్లు కంగారు బౌలర్లను ఉతికి ఆరేస్తున్నారు. మరో కొన్ని నెలల్లో టీ 20 ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో యువ ఆటగాళ్ల ఆట ఆకట్టుకుంటోంది. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ 20లో టీమిండియా బ్యాటర్ల విధ్వంసంతో టీ 20 మ్యాచ్‌ల చరిత్రలో పలు రికార్డులు బద్దలయ్యాయి. 



 ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ బ్యాటర్లు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు.  రెండో టీ 20లో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. కేవలం 24 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ కొట్టిన జైస్వాల్.. మొత్తంగా 25 బాల్స్ ఆడి 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. రుతురాజ్ గైక్వాడ్ 3 ఫోర్లు, 2 సిక్సులతో 43 బంతుల్లోనే 58 పరుగులు చేశాడు. కేవలం 32 బంతుల్లో ఇషాన్ కిషన్ 3 ఫోర్లు, 4 సిక్సర్ లతో 52 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలో తొలిసారిగా భారత జట్టు టాప్ 3 బ్యాటర్లు 50కిపైగా పరుగులు సాధించి రికార్డు సృష్టించారు. ఈ రికార్డు సాధించిన టీమిండియా బ్యాటర్లుగా యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ నిలిచారు. ఎంతో మంది సీనియర్లు అందుకోలేని ఈ ఘనతను కుర్రాళ్లు అందుకోవడంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఓపెనర్లు చెలరేగడంతో పవర్ ప్లేలోనే మన జట్టు 77/1 పరుగులు సాధించింది. టీ20 క్రికెట్‌లో పవర్‌ప్లేలో ఆస్ట్రేలియాపై టీమిండియాకు ఇదే అత్యధిక స్కోరు. 2016లో ఆస్ట్రేలియాపై జరిగిన టీ 20 మ్యాచ్‌ పవర్‌ ప్లేలో సాధించిన 74/1 రికార్డును యువ భారత్‌ బ్రేక్ చేసింది. 


ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ 20 సిరీస్‌లో యువ భారత్ జోరు మాములుగా లేదు. కంగారులతో జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌లో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన భారత జట్టు... రెండో టీ 20లోనూ ఘన విజయం సాధించింది. తొలుత భారీ స్కోరు సాధించిన సూర్యకుమార్‌ యాదవ్‌ సేన.. అనంతరం కంగారులను కంగారు పెట్టి విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. టపార్డర్‌ రాణించడంతో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ చేసింది. అనంతరం 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారులు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 191 పరుగులకే పరిమతమయ్యారు. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి 426 పరుగులు చేయడం విశేషం. తొలి టీ20 మ్యాచ్లో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా ఈసారి తొలుత బాటింగ్ చేసి భారీ స్కోర్ నమోదు చేసింది. టీమిండియా ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్.. యశస్వి జైస్వాల్... భారత్ కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. కేవలం ఆరు ఓవర్ లలో 77 పరుగులు జోడించి భారీ స్కోరుకు పునాది వేశారు. యశస్వి జైస్వాల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 25 బంతుల్లో 53 పరుగులు చేశాడు. జైస్వాల్ 9 ఫోర్లు, రెండు భారీ సిక్సర్లు బాదాదు.  జైస్వాల్ ని ఇంగ్లీష్ అవుట్ చేశాడు. కేవలం 32 బంతుల్లో ఇషాన్ కిషన్ 3 ఫోర్లు, 4 సిక్సర్ లతో 52 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply