IND vs AUS 1st Test:  బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఆ జట్టు ఆటగాళ్లు వరుసగా గాయపడుతున్నారు. ఇప్పటికే ఆ జట్టు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ దూరం కాగా.. ఇప్పుడు మరో పేస్ బౌలర్ జోష్ హేజిల్ వుడ్ గాయంతో తొలి టెస్టుకు దూరమయ్యాడు. 


గత నెలలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిడ్నీ టెస్ట్ సందర్భంగా జోష్ హేజిల్ వుడ్ ఎడమకాలికి గాయమైంది. దాన్నుంచి ఇంకా కోలుకోలేదని తాజాగా హేజిల్ వుడ్ వెల్లడించాడు. దీంతో భారత్ తో జరిగే తొలి టెస్టుకు దూరమయ్యాడు. అలాగే రెండో టెస్టులో కూడా అతను ఆడడం అనుమానంగా మారింది. ప్రీ- సిరీస్ క్యాంప్ లోనూ జోష్ చురుగ్గా పాల్గొనడంలేదు. ఇప్పటికే ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ సేవలను కోల్పోయింది. 


'మొదటి టెస్ట్ గురించి కచ్చితంగా తెలియదు. దానికి ఇంకా కొన్నిరోజుల సమయమే ఉంది. అప్పటికి నేను కోలుకుంటానో లేదో తెలియదు. ప్రస్తుతం కొంచెం వర్క్ లోడ్ మేనేజ్ మెంట్ ఉంది. బహుశా నేను కోరుకున్నంతగా కోలుకోలేదు. అయినా నేను కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నాను.' అని జోష్ హేజిల్ వుడ్ అన్నాడు. గత రెండు సంవత్సరాలుగా హేజిల్ వుడ్ గాయాలతో నిరంతరం పోరాడుతూనే ఉన్నాడు. ఈ సమయంలో కేవలం 4 టెస్టులు మాత్రమే ఆడాడు. 






ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం


భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టు మ్యాచ్ ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఫిబ్రవరి 9వ తేదీ నుంచి నాగ్‌పూర్‌లో జరగనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ దృష్ట్యా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చాలా ముఖ్యమైనది.


ఈ సమయంలో భారతదేశం, ఆస్ట్రేలియా నుండి చెరో ఐదుగురు క్రికెటర్లను ఎంపిక చేసింది. వీరి మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పరస్పర పోరు చూడవచ్చు. ఐసీసీ విడుదల చేసిన ఈ జాబితాలో విరాట్ కోహ్లీ, పాట్ కమిన్స్ వంటి పెద్ద పేర్లు ఉన్నాయి.


ఈ ఆటగాళ్ల మధ్య ఇంట్రస్టింగ్ ఫైట్



  • విరాట్ కోహ్లీ vs నాథన్ లియాన్

  • రోహిత్ శర్మ vs పాట్ కమిన్స్

  • చెతేశ్వర్ పుజారా vs జోష్ హేజిల్‌వుడ్

  • రవి అశ్విన్ vs డేవిడ్ వార్నర్

  • రవీంద్ర జడేజా vs స్టీవ్ స్మిత్