IND vs AUS: ప్రాక్టీస్ మ్యాచ్‌కు ఆడబోమన్న ఆస్ట్రేలియా - సురేష్ రైనా ఏమన్నాడంటే?

ఆస్ట్రేలియా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటానికి నిరాకరించడంపై సురేష్ రైనా స్పందించాడు.

Continues below advertisement

Suresh Raina India vs Australia Test: ఫిబ్రవరి 9వ తేదీ నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్టు సిరీస్ జరగనుంది. దీని తొలి మ్యాచ్ నాగ్‌పూర్‌లో జరగనుంది. ఈ సిరీస్‌కు ముందు ఇరు దేశాల మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేందుకు ఆస్ట్రేలియా నిరాకరించింది. కంగారూ జట్టు తీసుకున్న ఈ నిర్ణయంపై భారత మాజీ ఆటగాడు సురేశ్ రైనా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

Continues below advertisement

ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం బెంగళూరులో ప్రాక్టీస్ చేస్తుంది. ఆస్ట్రేలియా ఇక్కడి బౌన్సీ పిచ్‌లపై ప్రాక్టీస్ చేస్తోంది. అలాగే బరోడా స్పిన్నర్ మహేష్ పిథియాను బౌలింగ్ చేయడానికి పిలిచారు. అతని బౌలింగ్ యాక్షన్ రవిచంద్రన్ అశ్విన్‌ను పోలి ఉంటుంది. అయితే భారత అత్యుత్తమ వైట్-బాల్ ఆటగాళ్ళలో ఒకరైన సురేష్ రైనా, ఆస్ట్రేలియా జట్టు సిరీస్‌ను కోల్పోతుందని భావిస్తున్నాడు.

భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ గురించి రైనా మాట్లాడుతూ, "నేను టెస్టుకు ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడాను. అవి చాలా ముఖ్యమైనవి. వారు (ఆస్ట్రేలియా) భారత పిచ్‌లపై ఆడటం ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలరు. నాలుగింటిలో భారత్ రాణిస్తుంది. టెస్ట్ సిరీస్‌లో రవీంద్ర జడేజా పునరాగమనం జట్టులో మంచి సమతుల్యతను తీసుకువస్తుంది. చాలా కాలం తర్వాత జడేజా తిరిగి రావడం సంతోషంగా ఉంది." అన్నాడు. దీంతో పాటు "మా స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌ బాగా రాణిస్తున్నారు. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ మంచి ఫామ్‌లో ఉన్నారు కాబట్టి మంచి సిరీస్‌ని చూడగలమని భావిస్తున్నాను." అని రైనా అన్నాడు.

ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 13వ తేదీ మధ్య నాగ్‌పూర్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. దీని తర్వాత ఫిబ్రవరి 17వ తేదీ నుంచి ఫిబ్రవరి 21వ తేదీ మధ్య ఢిల్లీలో రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇక మూడో టెస్టు మార్చి ఒకటో తేదీ నుంచి మార్చి 5వ తేదీ దాకా ధర్మశాలలో జరగనుంది. మార్చి 9వ తేదీ నుంచి 13వ తేదీ దాకా అహ్మదాబాద్‌ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది.

దీని తర్వాత రెండు జట్లూ మూడు వన్డేల సిరీస్ కూడా ఆడనున్నాయి. ఈ సిరీస్‌లో తొలి వన్డే ముంబైలో, రెండో వన్డే విశాఖపట్నంలో, మూడో వన్డే చెన్నైలో జరగనుంది. ప్రస్తుతం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ భారత జట్టు వద్ద ఉంది. చివరిసారిగా ఆస్ట్రేలియా జట్టును సొంతగడ్డపై ఓడించి టీమిండియా సిరీస్‌ను గెలుచుకుంది.

అయితే తొలి టెస్టు మ్యాచ్‌కు భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ దూరం అయ్యాడు. వెన్ను గాయం కారణంగా అయ్యర్ తొలి మ్యాచ్‌ ఆడటం లేదు. రెండో టెస్టు మ్యాచ్‌ నాటికి శ్రేయస్ అయ్యర్‌ ఫిట్‌నెస్‌ను తిరిగి పొందనున్నాడని సమాచారం. అయితే గాయాల నుంచి కోలుకోవడం గురించి కచ్చితంగా చెప్పలేం. సరిగ్గా జాగ్రత్తలు తీసుకోకపోతే ఊహించిన దాని కంటే ప్రమాదకరం అయిన సంఘటనలు ఇంతకు ముందు చాలా సార్లు చూశాం. అంతకుముందు శ్రేయస్ అయ్యర్ న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ స్క్వాడ్‌లో కూడా ఉన్నాడు. కాని తర్వాత కోలుకోవడం కోసం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి పంపారు.

Continues below advertisement
Sponsored Links by Taboola