Former cricketers  Shower Praise On Rishabh Pant: బంగ్లాదేశ్(BAN) తో జరిగిన తొలి టెస్టులో అద్భుత శతకంతో చెలరేగిన టీమిండియా స్టార్ రిషభ్ పంత్(Rishabh Pant) పై  ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆక్సిడెంట్ తర్వాత ఆడిన తొలి టెస్టు మ్యాచులోనే వీరోచిత సెంచరీ సాధించి భారత జట్టు విజయంలో పంత్ కీలక పాత్ర పోషించాడు. శుభ్ మన్ గిల్(Gill) తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పి... బంగ్లాదేశ్ కు విజయాన్ని దూరం చేశాడు.  632 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు మ్యాచ్ ఆడిన పంత్. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా ఆడి 109 పరుగులు చేశాడు. ఈ శతకానికి తోడు గిల్, అశ్విన్ శతకాలతో భారత జట్టు 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 2022లో జరిగిన ఘోరమైన కారు ప్రమాదం తర్వాత పంత్ విజయవంతంగా టెస్టుల్లోకి తిరిగి రావడంపై  మాజీ క్రికెటర్లు ఫిదా అయిపోయారు. పంత్ ను సూపర్ మాన్.. మిరాకిల్ మాన్ అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు.

 

పంత్ ఓ అద్భుతం: వసీమ్ అక్రమ్

26 ఏళ్ల పంత్ మానసిక సంకల్పం, అతడి దృఢత్వానికి ఫిదా అయిపోయానని పాకిస్థాన్ దిగ్గజ ఆటగాడు వసీమ్ అక్రమ్(Wasim Akram) అన్నాడు. పంత్ ప్రమాదానికి గురైన వార్త తెలియగానే భారత్‌లో మాదిరిగానే పాకిస్థాన్‌లోని క్రికెట్ అభిమానులు ఆందోళన చెందారని అన్నారు. ఆ క్లిష్ట దశ నుంచి కోలుకున్న పంత్... ఆడిన తొలి టెస్టులోన అద్భుత పునరాగమనం చేశాడని అన్నాడు. ఈ ఇన్నింగ్స్ తో పంత్ మానవాతీతుడిగా కనిపించాడని అక్రమ్ అన్నాడు. పంత్ స్ట్రోక్-ప్లే అద్భుతంగా ఉందన్న అక్రమ్... టెస్టు క్రికెట్‌లో అతను ఆడే విధానం ఆకట్టుకుందని తెలిపాడు. పంత్ పునరాగమనం తరతరాలకు స్ఫూర్తివంతమై కథ అవుతుందని కొనియాడాడు. సంబంధించిన కథ అని, ఎలాంటి పరిస్థితి నుండి అయినా తిరిగి పుంజుకునేలా ఇది యువతను ప్రేరేపిస్తుందని అక్రమ్ అన్నారు.

"ఇది తరతరాలు మరియు తరాలకు చెప్పవలసిన కథ, నా అభిప్రాయం ప్రకారం, ప్రపంచంలోని యువకులను ప్రేరేపించడానికి. మీరు పంత్ చేసిన విధంగా తిరిగి రావచ్చు," అని అక్రమ్ అన్నాడు. "అతను తిరిగి వచ్చాడు మరియు ఐపిఎల్‌లో 40 సగటుతో, 155 స్ట్రైక్ రేట్‌తో 446 పరుగులు చేశాడు, అతను ఒక అద్భుత పిల్లవాడు" అని అక్రమ్ ముగించాడు.

 

పంత్‌పై గిల్‌క్రిస్ట్ ప్రశంసలు

రిషబ్ పంత్‌పై ఆసీస్ మాజీ క్రికెటర్ గిల్‌క్రిస్ట్(adam gilchrist) ప్రశంసలు కురిపించారు. పంత్‌ది గ్రేటెస్ట్ కంబ్యాక్ అని కొనియాడారు. పంత్ తన కంటే దూకుడుగా ఆడతున్నాడని గిల్‌క్రిస్ట్ పేర్కొన్నారు. తనకు ఎవరి బౌలింగ్‌లోనైనా ఎలాంటి భయం లేకుండా ఆడటం నచ్చుతుందన్నారు. ఆటలో ఎప్పుడు దూకుడుగా ఆడాలో, ఎప్పుడు వేగం తగ్గించాలో పంత్‌కు తెలుసు అని స్పష్టం చేశారు.
Read Also: మహిళల టీ 20 ప్రపంచకప్‌లో అద్భుత పోరాటాలు, చారిత్రక క్షణాలు

 

పంత్ ఓ సూపర్ మ్యాన్

చెన్నైలో జరిగిన తొలి టెస్టులో పంత్ వీరోచిత బ్యాటింగ్ పై న్యూజిలాండ్ మాజీ బ్యాటర్ ఇయాన్ స్మిత్(ian smith) ప్రశంసలు కురిపించాడు. పంత్ ఓ సూపర్ మ్యాన్ అని కొనియాడాడు. దాదాపు రెండేళ్ల తర్వాత టెస్ట్ ఆడిన పంత్ శతకం సాధించడం మాములు విషయం కాదన్నాడు. ఈ ఇన్నింగ్స్ తో తాను పంత్ అభిమానిగా మారిపోయానని ఇయాన్ స్మిత్ అన్నాడు.