ICC World Cup 2023 Ticket: వన్డే ప్రపంచకప్‌ను ప్రత్యక్షంగా స్టేడియాలకు వెళ్లి వీక్షించాలనుకునే అభిమానులకు గుడ్ న్యూస్. భారత్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈడెన్ గార్డెన్ (కోల్‌కతా) వేదికగా జరుగబోయే మ్యాచ్‌లకు గాను బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) టికెట్ ధరలను విడుదల చేసింది. సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉన్న టికెట్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి. క్యాబ్ అధ్యక్షుడు స్నేహశీశ్ గంగూలీ ఈ వివరాలను వెల్లడించారు.
కోల్‌కతాలో వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఐదు జరుగుతాయి. ఇందులో నాలుగు లీగ్ మ్యాచ్‌లతో పాటు ఒక సెమీస్ కూడా ఉంది. లీగ్ మ్యాచ్‌లలో భాగంగా భారత జట్టు సౌతాఫ్రికాతో లీగ్ మ్యాచ్ కూడా ఇక్కడే జరగాల్సి ఉంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు లు కూడా లీగ్ దశలో ఇక్కడ రెండేసి మ్యాచ్‌లు ఆడనున్నాయి.
ఈడెన్ గార్డెన్‌లో ఉన్న సీట్స్, స్టాండ్స్ ను పలు కేటగిరీలుగా విభజించిన క్యాబ్.. రేట్లను సాధారణ ప్రజలకు అందుబాటులోనే ఉంచింది. బంగ్లాదేశ్ వర్సెస్ క్వాలిఫయర్ మ్యాచ్‌కు గాను అప్పరట్ టైర్స్‌కు రూ. 650, డి అండ్ హెచ్ స్టాండ్స్‌కు రూ. 1,000, బి, సి, కె, ఎల్ స్టాండ్స్‌కు రూ. 1,500 గా నిర్ణయించింది. ఈ స్టేడియం సీటింగ్ కెపాజిటీ 63,500గా ఉంది.
ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కు..
అప్పర్ టైర్స్ : రూ. 800
డి, హెచ్ బ్లాక్స్ : రూ. 1,200
సి, కె బ్లాక్స్ : రూ. 2,000
బి, ఎల్ బాక్స్ : రూ. 2,200
బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్..
అప్పర్ టైర్స్ : రూ. 800
డి, హెచ్ బ్లాక్స్ : రూ. 1,200
సి, కె బ్లాక్స్ : రూ. 2,000
బి, ఎల్ బాక్స్ : రూ. 2,200
బంగ్లాదేశ్ వర్సెస్ నెదర్లాండ్ మ్యాచ్..
అప్పర్ టైర్స్ : రూ. 650
డి, హెచ్ బ్లాక్స్ : రూ. 1,000
సి, కె, బి, ఎల్ బ్లాక్స్ : రూ. 1,500
ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్.. (నవంబర్ 5న)
అప్పర్ టైర్స్ : రూ. 900
డి, హెచ్ బ్లాక్స్ : రూ. 1,500
సి, కె బ్లాక్స్ : రూ. 2,500
బి, ఎల్ బాక్స్ : రూ. 3,000
- సెమీఫైనల్స్ మ్యాచ్ (నవంబర్ 11) కు కూడా ఇండియా, సౌతాఫ్రికా మ్యాచ్‌కు ఉన్న ధరలే వర్తిస్తాయి.
పాకిస్తాన్ సెమీఫైనల్ కు అర్హత సాధిస్తే ఆ జట్టు సెమీస్ ఇక్కడే ఆడే అవకాశం ఉంటుంది. భారత జట్టు సెమీస్‌కు చేరితే మెన్ ఇన్ బ్లూ.. ముంబైలోని వాంఖెడే వేదికగా సెమీస్ ఆడతారు. క్యాబ్ టికెట్ రేట్స్ ను విడుదల చేసిన నేపథ్యంలో మిగతా క్రికెట్ స్టేట్ అసోసియేషన్స్ కూడా త్వరలోనే దీనిపై ఓ ప్రకటన చేసే అవకాశముంది. ఈ వరల్డ్ కప్ లోనే బిగ్గెస్ట్ మ్యాచ్ అయిన ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న అహ్మదాబాద్‌లో టికెట్ రేట్లు ఏ విధంగా ఉండనున్నాయో మరి..