England and India 1St Test Match Updates: హైదరాబాద్‌ (Hydierabad)వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా(Team India) తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 436 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ 421/7 స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ కాసేపటికే మిగిలిన మూడు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌట్‌గా కాగా...... మన ఆధిక్యం 190గా ఉంది. బ్యాటింగ్‌లో జడేజా (87), కేఎల్‌ (86) జైస్వాల్‌ (80) అర్థ సెంచరీలతో రాణించారు . అక్షర్‌ (44), భరత్‌ (41) అర్ధశతకాలు చేజార్చుకున్నారు. రోహిత్‌ (24), గిల్‌ (23), అయ్యర్‌ (35) ఫర్వాలేదనిపించగా.. అశ్విన్‌ (1), బుమ్రా (0) నిరాశపరిచారు. సిరాజ్‌ నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో రూట్‌ నాలుగు, హార్ట్‌లీ రెండు వికెట్లు తీశారు. 
ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. 
పట్టు దొరికినట్లే...
ఇంగ్లాండ్‌పై భారత్‌ ఇప్పటికే 190 పరుగుల ఆధిక్యంలో ఉంది. స్పిన్‌ తిరుగుతున్న వేళ బ్రిటీష్‌ జట్టు.. భారత్‌ బౌలర్ల సవాల్‌ను స్వీకరించడం అంత తేలికేం కాదు. తొలుత బంతితో ఇంగ్లండ్‌ను కట్టడి చేసిన భారత జట్టు.. ఆ తర్వాత బ్యాట్‌తోనూ చెలరేగి మ్యాచ్‌పై పట్టు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఓవర్‌ నైట్‌ స్కోరు 76 పరుగులతో క్రీజులోకి వచ్చిన యశస్వి జైస్వాల్‌(Yashaswi Jaiswal) త్వరగానే పెవిలియన్‌కు చేరాడు. సెంచరీ సాధిస్తాడని అందరూ అనుకున్న వేళ 76 పరుగులకు మరో నాలుగు పరుగులు మాత్రమే జోడించి జైస్వాల్‌ అవుటయ్యాడు. రూట్‌ బౌలింగ్‌లో జైస్వాల్‌ 80 పరుగులు చేసి అవుటయ్యాడు. జైస్వాల్‌ అవుటయ్యాక కె.ఎల్‌ రాహుల్‌(KL Rahul) క్రీజులోకి వచ్చాడు. గిల్‌, రాహుల్ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును నడిపించారు. రూట్‌, హార్ట్‌లీ బౌలింగ్‌ను వీరిద్దరూ సమర్థంగా ఎదుర్కొన్నారు. కానీ అప్పటివరకూ జాగ్రత్తగా ఆడిన గిల్‌ భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు. హార్ట్‌ లీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి శుభ్‌మన్‌ గిల్‌ అవుటయ్యారు. 23 పరుగులు చేసి గిల్‌ అవుట్‌ కావడంతో టీమిండియా 159 పరుగుల వద్ద మూడో వికెట‌్ కోల్పోయింది. అనంతరం శ్రేయస్స్ అయ్యర్‌తో కలిసి రాహుల్ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. వీరిద్దరూ చక్కటి భాగస్వామ్యంతో భారత స్కోరు బోర్డును 200 పరుగులు దాటించారు. తొలి సెషన్‌ను విజయంవంతంగా ముగించిన భారత్‌కు రెండో సెషన్‌ ఆరంభంలోనే షాక్‌ తగిలింది. మంచి టచ్‌లో కనిపించిన శ్రేయస్స్ అయ్యర్‌ భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు. 35 పరుగులు చేసిన అయ్యర్‌ రెహాన్‌ బౌలింగ్‌లో బౌండరీ లైన్‌ వద్ద క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో 223 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది.
జడేజా కీలక ఇన్నింగ్స్‌
అయ్యర్‌ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన జడేజా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. హార్ట్‌ లీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి కె.ఎల్‌. రాహుల్‌ అవుటయ్యాడు. 80 పరుగులు చేసి రాహుల్‌ అవుటయ్యాడు. శతకం దిశగా సాగుతున్న రాహుల్‌ భారీ షాట్‌కు యత్నించి అవుటవ్వడంతో టీమిండియా 291 పరుగుల వద్ద అయిదో వికెట్‌ కోల్పోయింది. అనంతరం శ్రీకర్‌ భరత్‌ కూడా మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. 41 పరుగులు చేసి భరత్‌ అవుటయ్యాడు. లేని పరుగు కోసం యత్నించి అశ్విన్‌ అవుటవ్వడంతో టీమిండియా భారీ ఆధిక్యం సాధించడం కష్టమే అనిపించింది. కానీ జడేజా.. అక్షర్‌ పటేల్‌ మరో వికెట్‌ పడకుండా రెండో రోజూ ఆటను ముగించారు. సమయోచితంగా ఆడిన ఈ జోడి మంచి భాగస్వామ్యంతో మ్యాచ్‌ను భారత్‌ చేతుల్లోకి తెచ్చింది. జడేజా 81 పరుగులతో,.. అక్షర్‌ పటేల్‌ 35 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో రోజూ ఆట ముగిసే సమయానికి టీమిండియా 7 వికెట్లు నష్టపోయి 421 పరుగులు చేసింది. ప్రస్తుతం రోహిత్‌ సేన 175 పరుగుల ఆధిక్యంలో ఉంది. అనంతరం ఈరోజు మరో 15 పరుగులు జోడించి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగించింది. టీమిండియా మొత్తం ఆధిక్యం 190 పరుగులుగా ఉంది.