T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌ (T20 World Cup 2022) దగ్గర పడింది. అక్టోబర్ 16 నుంచి ప్రారంభమయ్యే ఈ ఐసిసి ఈవెంట్ కోసం  అభిమానులు చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. చాలా మంది టీవీలో క్రికెట్ మ్యాచ్‌లను చూడటానికి ఇష్టపడతారు. మరికొందరు మైదానంలోకి వెళ్లి స్టేడియంలో కూర్చొని మ్యాచ్‌ను ఆస్వాదించాలని కోరుకుంటారు. 2022 టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా అక్టోబర్ 23న మెల్‌బోర్న్‌ క్రికెట్ మైదానంలో పాకిస్థాన్‌తో టీమ్ఇండియా తొలి మ్యాచ్ ఆడనుంది.


ఈసారి టీ20 ప్రపంచ కప్ ఆస్ట్రేలియాలో జరగనుంది. మైదానంలో స్టాండ్స్‌లో కూర్చొని టీ20 వరల్డ్ కప్‌ను ఎలా చూడాలో... ఆస్వాదించాలో ఎలా చూడవచ్చో చెప్పబోతున్నాం.


టీ20 ప్రపంచ కప్ టికెట్లు ఎలా కొనాలి


టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2022) మ్యాచ్‌లు చూడాలంటే t20worldcup.com టీ20 ప్రపంచ కప్ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి టికెట్లు కొనుగోలు చేయాలి. ఈ వెబ్ సైట్ ఓపెన్ చేసి ముందు టిక్కెట్ కేటగిరీకి వెళ్ళాలి. అక్కడ మీకు బై టిక్కెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీని తరువాత మీరు మీకు ఇష్టమైన మ్యాచ్‌ను ఎంచుకోవచ్చు. ఈసారి 80కిపైగా దేశాలకు చెందిన ప్రజలు టీ20 ప్రపంచ కప్ వీక్షించేందుకు వస్తారని ఐసీసీ భావిస్తోంది. ఈ మధ్యే దీనిపై ఓ ప్రకటన కూడా చేసింది. భారత్ క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసే  భారత్ వర్సెస్ పాకిస్తాన్ వంటి కొన్ని మ్యాచ్‌ల టిక్కెట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయి.


టికెట్ ధర ఎంత?


రౌండ్ వన్, సూపర్-12లో జరిగే మ్యాచ్‌లకు పిల్లల టికెట్ల కనీస ధరను 5 డాలర్లు (సుమారు రూ.410)గా సైట్‌లో చూపిస్తున్నారు. అదే సమయంలో పెద్దవాళ్ల టికెట్ కనీస ధరను 20 డాలర్లు (సుమారు రూ.1650)గా ఉంచారు.


ఆస్ట్రేలియాకు వెళ్లాలంటే ఈటీఏ అవసరం 


ఆస్ట్రేలియాకు వెళ్లడానికి మీకు ఎలక్ట్రానిక్ ట్రావెల్ అథారిటీ అవసరం అవుతుంది. ఈటిఎను ఆస్ట్రేలియా ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఇది ఎలక్ట్రానిక్ వీసా. ఈ వీసా పొందిన తర్వాత టూరిస్టుగా 90 రోజులపాటు ఆస్ట్రేలియాలో ఉండొచ్చు. ఈ వీసా మీ పాస్ పోర్ట్‌తో లింక్ చేస్తారు. అదే సమయంలో  ఒక మ్యాచ్ చూడటానికి మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి అనేది నగరాన్ని బట్టి మారుతుంది.