T20 WC Warm-up Matches IND v WA X1 2022: ఆస్ట్రేలియాలో 2022 టీ20 ప్రపంచకప్ కోసం సన్నద్ధమవుతున్న టీమ్ఇండియా ఈ రోజు పెర్త్ వేదికగా వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో తొలి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా 13 పరుగుల తేడాతో వెస్ట్రన్ ఆస్ట్రేలియాను ఓడించింది. భారత్ తరఫున సూర్యకుమార్ యాదవ్, అర్ష్‌దీప్‌ సింగ్ అద్భుతంగా రాణించారు.


తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన  వెస్టర్న్ ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 145 పరుగులు మాత్రమే చేయగలిగింది.


భారత్ తరఫున సూర్యకుమార్ కేవలం 35 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా 29 పరుగులు చేశాడు. దీపక్ హుడా (22), దినేశ్ కార్తీక్ (19) రాణించారు.


ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్‌లు భారత్ తరఫున ఇన్నింగ్స్ ప్రారంభించారు. రోహిత్ 3, పంత్ 9 పరుగులు మాత్రమే చేశారు. అర్ష్‌దీప్‌ సింగ్ బౌలింగ్‌తో రాణించాడు. అర్ష్‌దీప్‌ సింగ్ మూడు వికెట్లు తీసుకున్నాడు.  భువనేశ్వర్ కుమార్‌కు రెండు వికెట్లు లభించాయి. 


టాస్ గెలిచిన రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మ్యాచ్‌కు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇచ్చారు. దీపక్ హుడా 14 బంతుల్లో 22 పరుగులు చేయగా, హార్దిక్ పాండ్యా 20 బంతుల్లో 29 పరుగులు చేశాడు.


వెస్టర్న్ ఆస్ట్రేలియా ఎలెవన్ ప్లేయింగ్ ఎలెవన్: డి'ఆర్సీ షార్ట్, ఆరోన్ హార్డీ, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ (వికెట్ కీపర), అష్టన్ టర్నర్ (కెప్టెన్), సామ్ ఫానింగ్, హమిష్ మెకంజీ, రిచర్డ్సన్, ఆండ్రూ టై, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, మాథ్యూ కెల్లీ, నిక్ హాబ్సన్.


టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, యజువేంద్ర చాహల్.