South Africa In Wtc Final: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ 2025 కు చేరిన తొలి జట్టుగా సౌతాఫ్రికా నిలిచింది. ఆ జట్టు ఒక టెస్టు ఉండగానే మెగా పోరుకు చేరుకుంది. అయితే దీనిపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్, ఆసీస్ మాజీ ప్లేయర్ స్టీవ్ ఓకీఫ్ విమర్శలు చేశారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లతో తలపడకుండానే సౌతాఫ్రికా ఫైనల్ చేరిందని, ప్రొటీస్ ఓడించిన టీమ్స్ అంత పెద్దవి కావని విమర్శించాడు. దీనిపై తాజాగా ఆ జట్టు కోచ్ షుక్రి కోన్రాడ్ సమాధానమిచ్చాడు. 


మేం తెలివిగా వ్యవహరించాం..
ప్రస్తుత ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ పద్ధతి లోపభుయిష్టంగా ఉందని, ఏదైన జట్టు మూడేసి సిరీస్ ల చొప్పున ఇంటా బయట ఆడితే సరిపోతుందని, అంతా కలిపి 12 టెస్టులాడితే సరిపోతుందని కొన్రాడ్ గుర్తు చేశాడు. ఈక్రమంలో తాము టైం సేవింగ్ కోసం రెండేసి మ్యాచ్ ల చొప్పున ఆరు సిరీస్ లను నిర్వహించామని, ఇందులో తప్పేమీ లేదని సమర్థించుకున్నాడు. అలాగే ఆస్ట్రేలియాను ఆసీస్ లో వెస్టిండీస్ ఓడించిందని అలాంటి జట్టును తాము ఓడించామని తెలిపాడు. ఇక న్యూజిలాండ్, ఇంగ్లాండ్ లను ఓడించిన శ్రీలంకు తాము ఓడించిన విషయాన్ని గుర్తు చేశాడు. ఇవేమీ పెద్ద టీమ్ లకు తక్కువ కావని తెలిపాడు. ఇంగ్లాండ్, ఆసీస్, భారత్ లాంటి జట్లు ఐదేసి టెస్టుల చొప్పున తమకు అనుకూలంగా సిరీస్ లను ఏర్పాటు చేసుకున్నాయని, తాము మాత్రం ఫైనల్ లక్ష్యంగా రెండు మ్యాచ్ ల చొప్పున సిరీస్ లను ఆడామని పేర్కొన్నాడు. 


Also Read: Rishabh Pant Record: 148 ఏళ్లలో తొలిసారి.. ఆసీస్ గడ్డపై సరికొత్తగా పంత్ రికార్డు.. ఐదో టెస్టులో జూలు విదిల్చిన పంత్


రెండు జట్లతో ఆడే అవకాశం లేదు.. 
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ఆరు జట్లతో ఆరు సిరీస్ లో ఆడితే సరిపోతుందని, ఈ క్రమంలో కొన్ని జట్లతో అసలు సిరీస్ ఆడకపోయినా సరిపోతుందని వ్యాఖ్యానించారు. అయినా తాము చాలా రిస్క్ చేశామని, తమ ఫ్రంట్ లైన్ బౌలర్లు అందుబాటులో లేకపోయినా, యువ ఆటగాళ్లను న్యూజిలాండ్ కు పంపిన విషయాన్ని గుర్తు చేశాడు. ఆ సిరీస్ లో 2-0తో ప్రొటీస్ ఓడిపోయింది. ఆ తర్వాత వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్ లపై నెగ్గి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ కు చేరుకుంది. ఈ విధానంపై గతంలో ఓ కీఫ్.. వింబుల్డన్ లో ఒక్క సీడెడ్ ప్లేయర్ ను ఆడకుండానే ఫైనల్ కు చేరినట్లుగా సౌతాఫ్రికా వ్యవహారం ఉందని ఘాటుగా విమర్శించాడు.


ఇక వచ్చే జూన్ లో ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ లార్డ్స్ వేదికగా జరుగుతుంది. ఇప్పటివరకు రెండుసార్లు జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో భారత్ రన్నరప్ గా నిలిిచింది. 


Also Read: Bumrah Injury Update: బ్యాటింగ్ ఓకే కానీ బౌలింగ్ మాత్రం డౌట్.. రేపు ఉదయమే దీనిపై నిర్ణయం.. బుమ్రా గాయంపై తాజా వివరాలు