Hardik Pandya suspiciously missing : రానున్న జూన్ 2వ తేదీ నుంచి ప్రపంచం అంతా ఉత్కంఠగా  టీ20 ప్రపంచ కప్(T20 world Cup) సమరం ప్రారంభం కాబోతోంది. ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్‌ ఆడనుండంతో ఇప్పటికే టీమిండియా(Team India) మొదటి  టీమ్ అమెరికా(US) వెళ్లింది. భారత  కెప్టెన్‌ హిట్ మ్యాన్ రోహిత్‌ శర్మ(Rohit Sharma)తో పాటు యువ క్రికెటర్లు అక్కడికి వెళ్లిపోయారు. అయితే, ఈ బృందంతో సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీతో పాటు వైస్‌ కెప్టెన్ హార్దిక్‌ పాండ్య(Hardic Pandya) మాత్రం ప్రస్తుతానికి బయలుదేరనే లేదని సమాచారం.  ఐపీఎల్‌(IPL)లో అద్భుతాలు సృష్టించిన విరాట్ కోహ్లీ,  వీసాకు సంబంధించి పేపర్ వర్క్‌ పెండింగ్‌లో ఉండటంతో అతను కొద్ది రోజులతరువాత ఉన్నాయని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.  అయితే హార్దిక్ పాండ్య విషయంలో మాత్రం కధ వేరే ఉంది. 


హార్దిక్‌-నటషా విడాకులు..?


హార్దిక్‌ పాండ్యా కష్టాలు కొనసాగుతున్నాయి. ఐపీఎల్‌లో ముంబై జట్టును సమర్థంగా నడిపించలేక.. వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శన చేయలేక ఘోరంగా విఫలమైన హార్దిక్‌కు ఇప్పుడు వ్యక్తిగత జీవితంలోనూ ఏదీ కలిసి రావడం లేదన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి.  హార్దిక్‌ పాండ్యా- నటాసా స్టాంకోవిక్ దంపతులు విడిపోతున్నారన్న వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. హార్దిక్‌ పాండ్యా విడాకుల అంశం సోషల్‌ మీడియాను షేక్‌ చేసేస్తోంది. హార్దిక్ పాండ్యా, అతని భార్య నటాషా స్టాంకోవిచ్ మధ్య కొంతకాలంగా సత్సంబంధాలు లేవని... వారు కలిసి ఉండడం లేదని కూడా ఊహాగానాలు చేలరేగుతున్నాయి. హార్దిక్- నటాషా విడాకులు తీసుకోబోతున్నారని చాలా వార్తా సంస్థలు కూడా స్పష్టం చేస్తున్నాయి. నటాషా ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో పాండ్యా పేరును తొలగించింది. అప్పటి నుంచి ఈ ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. మార్చిలో నటాషా జన్మదినం సందర్భంగా కూడా హార్దిక్‌ పాండ్యా ఎలాంటి శుభాకాంక్షలు తెలియజేయకపోవడం కూడా ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరేలా చేసింది. 


భారీ విడాకులు,  70 శాతం ఆస్తి ఆమెకేనా...!


హార్దిక్‌ పాండ్యా- నటషా జోడీ విడాకుల కోసం ఇప్పటికే కుటుంబ కోర్టును కూడా ఆశ్రయించిందని తెలుస్తోంది. అయితే వీరిద్దరి గురించి ఓ వార్త వైరల్‌గా మారింది. విడాకుల తర్వాత హార్దిక్ పాండ్యా ఆస్తిలో నటాషా స్టాంకోవిచ్‌ 70 శాతం వాటా తీసుకోనుందని తెలిసింది. ఈ వార్తలు నిజమే అయితే నటాషాకు కోట్ల రూపాయల వాటా దక్కనుంది. హార్దిక్ పాండ్యా కోట్ల ఆస్తికి యజమాని. ఐపీఎల్‌ మ్యాచ్ ఫీజుతో పాటు అనేక బిసిసిఐ ఇచ్చే ఇండియన్ టీమ్ ఫీజు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ వ్యాపారాల ద్వారా కూడా బాగానే  ఆదాయం సంపాదిస్తున్నాడు. అయితే ఈ రూమర్స్‌పై హార్దిక్‌ పాండ్యా ఇప్పటివరకూ అధికారికంగా స్పందించలేదు. అయితే వీటి అన్నింటివిషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవటానికే పాండ్య లండన్ వెళ్ళాడని తెలుస్తోంది,  అక్కడ నుంచే నేరుగా అమెరికాకు వస్తాడని సమాచారం.