ప్రపంచ క్రికెట్‌లో ఎవరైనా బ్యాట్స్‌మెన్ అవుట్ అయినప్పుడు మనం ఎక్కువగా వినేది గోల్డెన్ డక్ అనే పదం. కానీ కేవలం గోల్డెన్ డక్ మాత్రమే కాకుండా ఇంకా రకరకాల డకౌట్లు ఉన్నాయి. గోల్డెన్ డక్ నుంచి కింగ్ పెయిర్ వరకు మొత్తం ఎనిమిది రకాల డకౌట్లు ఉన్నాయి.


1. గోల్డెన్ డక్: ఒక బ్యాట్స్‌మెన్ ఒక్క రన్ కూడా చేయకుండా మొదటి బంతికే అవుట్ కావడం.
2. సిల్వర్ డక్: ఒక్క పరుగు కూడా చేయకుండా ఎదుర్కొన్న రెండో బంతికి అవుట్ అవ్వడం.
3. బ్రాంజ్ డక్: ఒక ఆటగాడు మూడో ఇన్నింగ్స్‌లో డకౌట్ అవ్వడం.
4. డైమండ్ డక్: ఒక్క బాల్ కూడా ఆడకుండా అవుట్ అవ్వడాన్ని డైమండ్ డక్ అంటారు. సాధారణంగా ఇలా రనౌట్ అవుతారు.
5. రాయల్ డక్: మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో మొదటి బంతికి అవుట్ అవ్వడాన్నే రాయల్ డక్ అంటారు. ఇది సాధారణంగా ఓపెనర్లకు వర్తిస్తుంది.
6. లాఫింగ్ డక్: టీమ్ ఇన్నింగ్స్ ముగింపు సమయంలో బ్యాట్స్‌మెన్ డకౌట్ అవ్వడం.
7. పెయిర్: ఒకే టెస్టు మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌట్ అవ్వడం.
8. కింగ్ పెయిర్: బ్యాట్స్‌మెన్ ఒక టెస్టు మ్యాచ్‌ల్లో రెండు ఇన్నింగ్స్‌లోనూ మొదటి బంతికే అవుట్ కావడం.


ఈసారి ఎవరైనా బ్యాట్స్‌మెన్ అంతర్జాతీయ క్రికెట్లో కానీ, ఐపీఎల్ వంటి క్రికెట్ లీగ్స్‌లో కానీ డకౌట్ అయితే వీటి ద్వారా అతను ఎలాంటి డకౌట్ అయ్యాడో సులభంగా తెలుసుకోండి.