Gautam Gambhir Press Conference Highlights: శ్రీలంక(Srilanka)తో ఈ నెలాఖరులో జరిగే టీ 20 సిరీస్‌కు హార్దిక్ పాండ్యా(Hardic Pandya)ను కాదని సూర్య కుమార్ యాదవ్(Surya Kumar yadav)కు సారథ్య బాధ్యతలు అప్పగించడంపై టీమ్‌ఇండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar) స్పందించాడు. ఎప్పుడూ అందుబాటులో ఉండే ఆటగాడికే కెప్టెన్సీ ఇవ్వాలని నిర్ణయించామని... అందుకే సూర్య కుమార్‌కు టీ20 కెప్టెన్సీ ఇచ్చామని వెల్లదించారు. హార్దిక్ భార జట్టులో కీలక ప్లేయర్ అన్నారు. సూర్యకు కెప్టెన్ అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని అగార్కర్ స్పష్టం చేశాడు. ఫిట్‌నెస్, డ్రెస్సింగ్ రూమ్ ఫీడ్‌బ్యాక్ వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే సూర్యకు పగ్గాలు అప్పగించామని అగార్కర్ స్పష్టం చేశాడు.
గంభీర్‌తో కలిసి మీడియా ముందుకు...
శ్రీలంక పర్యటనకు బయల్దేరే ముందు నూతన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir)తో కలిసి అగార్కర్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. టీ 20 క్రికెట్‌లో ఫిట్‌నెస్ చాలా ముఖ్యమైన విషయమన్న అగార్కర్... ఈ పార్మట్‌లో ఎప్పుడూ అందుబాటులో ఉండే ఆటగాడినే కెప్టెన్ చేయాలని నిర్ణయించామని తెలిపాడు. సూర్య అత్యుత్తమ టీ 20 బ్యాటర్లలో ఒకడని... కెప్టెన్‌గా కూడా అతడు విజయవంతమయ్యాడని గుర్తు చేశాడు. హార్దిక్ పాండ్యా నైపుణ్యంపై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవన్న అగార్కర్... అతడు తరచుగా అందుబాటులో ఉండకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి కూడా ఆటగాళ్ల అభిప్రాయం తీసుకున్న తర్వాతే సూర్యాకు ఈ బాధ్యతలు అప్పగించామని తెలిపాడు.
వన్డేలకు జడేజా ఉంటాడు
వన్డే జట్టు నుంచి రవీంద్ర జడేజాను తొలగించారన్న వార్తలను అజిత్ అగార్కర్ ఖండించాడు. జడేజా ఇప్పటికే టీ 20లకు గుడ్‌బై చెప్పాడు. ఈ నేపథ్యంలో శ్రీలంకతో జరిగే వన్డేల్లోనూ అతడికి చోటు దక్కలేదు. దీంతో జడేజా వన్డే కెరీర్ కూడా ముగిసిందన్న వార్తలు వచ్చాయి. దీనిపై అగార్కర్ స్పందించాడు. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా ఇద్దరిని మూడు మ్యాచ్‌ల సిరీస్‌కి తీసుకుంటే అది అర్థరహితంగా ఉండేదని అగార్కర్ తెలిపాడు. జట్టు సమతూకం కోసమే అక్షర్ ను తీసుకున్నామని తెలిపాడు. వచ్చే సిరీస్‌లలో జడేజాను పరిగణనలోకి తీసుకుంటామన్నాడు.
విరాట్ గురించి కూడా...
కింగ్ కోహ్లీతో గతంలో జరిగిన వివాదంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. తమ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది అన్నది టీఆర్‌పీలకు మంచిదని అన్నాడు. సొంత జట్టు కోసం, సొంత జెర్సీ కోసం పోరాడే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని గంభీర్ అన్నాడు. తాను భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నామని.. 140 కోట్ల మంది భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని గంభీర్ అన్నాడు. విరాట్ ప్రపంచ స్థాయి క్రీడాకారుడని.. తనంటే తనకు చాలా గౌరవం ఉందని అన్నాడు. భారత క్రికెట్‌ను మెరుగుపర్చడమే తన లక్ష్యమని గంభీర్ అన్నాడు. భారత క్రికెట్ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని గంభీర్ అన్నాడు. జైషాతో తనకు మంచి సంబంధం ఉందన్నాడు .