Andrew Flintoff Accident:  ఇంగ్లండ్ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ యాక్సిడెంట్ కు గురయ్యారు. టాప్ గేర్ అనే షో కోసం షూటింగ్ చేస్తుండగా కారు ప్రమాదానికి గురయ్యారు. గాయపడిన ఫ్లింటాఫ్ ను ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యులు తెలిపినట్లు సమాచారం. ఆయన ప్రమాదానికి సంబధించిన వివరాలు తెలియాల్సి ఉంది. 


ప్రమాదం ఎలా జరిగింది?


ఈ ఇంగ్లండ్ మాజీ వెటరన్ బీబీసీ షో టాప్ గేర్ కోసం షూటింగ్ చేస్తున్నప్పుడు ప్రమాదానికి గురయ్యాడు. టాప్ గేర్ టెస్ట్ ట్రాక్‌లో ఫ్లింటాఫ్ కారు నడుపుతుండగా ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదం జరిగిన వెంటనే మెడికల్ బృందం అతనిని పరీక్షించి తదుపరి చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే ఫ్లింటాఫ్ సాధారణ వేగంతో కారు నడపడం వల్ల ప్రాణాపాయం తప్పినట్లు సమాచారం. బీబీసీ టాప్ గేర్ షోలో ఆండ్రూ ఫ్లింటాఫ్ వ్యాఖ్యాతగా ఉన్నాడు. అతను 2019 నుంచి ఈ షోలో ఉన్నారు.  


ఫ్లింటాఫ్ కెరీర్


1998లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఫ్లింటాఫ్... 2009లో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన కెరీర్ లో 141 వన్డేల్లో 32 సగటుతో 3394 పరుగులు చేశాడు. 169 వికెట్లు తీశాడు. అలాగే 79 టెస్టులకు ప్రాతినిధ్యం వహించి 3845 పరుగులు సాధించాడు. 226 వికెట్లు పడగొట్టాడు. 7 టీంల్లో 76 పరుగులు చేసి 5 వికెట్లు తీసుకున్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ లో అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకడిగా ఫ్లింటాఫ్ పేరు తెచ్చుకున్నాడు.