T20 World Cup England Squad: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ జట్టును ఇంగ్లాండ్ ప్రకటించింది. 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది. మరో ముగ్గుర్ని ట్రావెలింగ్‌ రిజర్వుగా తీసుకుంది. గాయాల నుంచి కోలుకున్న సీమ్‌ బౌలర్లు క్రిస్‌వోక్స్‌, మార్క్‌వుడ్‌ తిరిగి జట్టులో చోటు సంపాదించారు. టీ20 ప్రపంచకప్‌లోనే కాకుండా పాకిస్థాన్‌ పర్యటనకూ ఎంపికయ్యారు. కాగా ఈ ఏడాది అక్టోబర్లో ఆస్ట్రేలియాలో మెగా టోర్నీ జరుగుతున్న సంగతి తెలిసిందే.