Ahmedabad Weather Forecast: 2023 క్రికెట్ ప్రపంచ కప్ బుధవారం నుంచి ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లు అహ్మదాబాద్‌లో తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌పై వర్షం ప్రభావం చూపుతుందా? రేపు అహ్మదాబాద్‌లో వర్షం కురుస్తుందా? అనే అనుమానాలు మాత్రం అభిమానుల్లో ఉన్నాయి. భారత్ ఆడాల్సిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దవ్వడమే దీనికి కారణం.


అయితే అహ్మదాబాద్‌లో బుధవారం వర్షం కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అహ్మదాబాద్‌లో బుధవారం ఉదయం వర్షం కురిసినా మ్యాచ్‌పై ప్రభావం ఏమాత్రం ఉండకపోవచ్చు.


భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సమయానికి ఆకాశం పూర్తిగా నిర్మలంగా ఉండే అవకాశం ఉంది. అహ్మదాబాద్‌లో ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కానుందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం అహ్మదాబాద్‌లో సూర్యరశ్మి ఉంటుంది. అలాగే గంటకు 22 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. బుధవారం జరిగే మ్యాచ్‌పై వర్షం ప్రభావం చూపదని భావిస్తున్నారు.


ఇంగ్లండ్ తుదిజట్టు (అంచనా)


జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్ / హ్యారీ బ్రూక్, జానీ బెయిర్ స్టో, లియామ్ లివింగ్ స్టన్, సామ్ కరన్,  క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్, రీస్ టాప్లే


న్యూజిలాండ్ తుది జట్టు (అంచనా)


విల్ యంగ్, డేవాన్ కాన్వే, డరైల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లేథమ్ (కెప్టెన్), జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధి, మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్


చెన్నైలో భారత్‌, ఆస్ట్రేలియా ఢీ...
ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగే మ్యాచ్ నుంచి భారత జట్టు తన ప్రపంచకప్ ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. అక్టోబరు 8వ తేదీన చెన్నైలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. దీని తర్వాత భారత జట్టు తన రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో ఆడనుంది. ఇరు జట్లు అక్టోబర్ 11వ తేదీన ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తలపడనున్నాయి.


అక్టోబర్ 14వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ జట్లతో పాటు ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లతో భారత జట్టు తలపడనుంది. ఈ టోర్నీ ఫైనల్ నవంబర్ 19వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.


ప్రపంచకప్ మ్యాచ్‌లకు వేదికలు ఇవే...
1. నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం (అహ్మదాబాద్)
2. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (హైదరాబాద్)
3. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (ధర్మశాల)
4. అరుణ్ జైట్లీ స్టేడియం (ఢిల్లీ)
5. ఎంఏ చిదంబరం స్టేడియం (చెన్నై)
6. ఎకానా క్రికెట్ స్టేడియం (లక్నో)
7. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (పుణె)
8. ఎం చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు)
9. వాంఖడే స్టేడియం (ముంబై)
10. ఈడెన్ గార్డెన్స్ (కోల్‌కతా)


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial