ENG vs NZ Playing XI Live Streaming: ప్రపంచ కప్‌లో బుధవారం జరిగే మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. జోస్ బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా ప్రపంచకప్‌లో అడుగుపెట్టనుంది. గత ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి ఇంగ్లండ్ తొలిసారి ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
ప్రత్యక్ష ప్రసారాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలి?
స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో క్రికెట్ అభిమానులు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించగలరు. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో అభిమానులు హిందీ, ఇంగ్లీషుతో సహా అనేక భాషలలో మ్యాచ్‌లను ఆస్వాదించగలరు. ఇది కాకుండా మీరు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో కూడా లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో హిందీ, ఇంగ్లీష్ కాకుండా 12 విభిన్న భాషలలో మ్యాచ్‌ని చూడవచ్చు. అభిమానులు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ యాప్‌లో ఉచితంగా లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు.
ఇంగ్లండ్ తుదిజట్టు (అంచనా)
జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టాప్లే
న్యూజిలాండ్ తుది జట్టు (అంచనా)
రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), మార్క్ చాప్‌మన్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీ, ట్రెంట్ బౌల్ట్ మరియు లాకీ ఫెర్గూసన్.
ఈ టోర్నీలో రెండో మ్యాచ్ పాకిస్థాన్, నెదర్లాండ్స్ మధ్య జరగనుంది. అక్టోబర్ 6వ తేదీన హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. దీని తర్వాత అక్టోబర్ 7వ తేదీన ధర్మశాలలో బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు తలపడనున్నాయి. అక్టోబర్ 8వ తేదీన ఆస్ట్రేలియాతో భారత జట్టు మ్యాచ్ ఆడనుంది. ఇరు జట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్ చెన్నైలో జరగనుంది.
2023 ప్రపంచకప్ పూర్తి షెడ్యూల్
అక్టోబర్ 5: ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ - అహ్మదాబాద్
అక్టోబర్ 6: పాకిస్థాన్ వర్సెస్ నెదర్లాండ్స్ - హైదరాబాద్
అక్టోబర్ 7: బంగ్లాదేశ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్- ధర్మశాల
అక్టోబర్ 7: దక్షిణాఫ్రికా వర్సెస్ శ్రీలంక - ఢిల్లీ
అక్టోబర్ 8: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా- చెన్నై
అక్టోబర్ 9: న్యూజిలాండ్ వర్సెస్ నెదర్లాండ్స్ - హైదరాబాద్
అక్టోబర్ 10: ఇంగ్లండ్ వర్సెస్ బంగ్లాదేశ్-ధర్మశాల
అక్టోబర్ 10: పాకిస్థాన్ వర్సెస్ శ్రీలంక- హైదరాబాద్
అక్టోబర్ 11: భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్- ఢిల్లీ
అక్టోబర్ 12: ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా- లక్నో
అక్టోబర్ 13: న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్- చెన్నై
అక్టోబర్ 14: భారత్ వర్సెస్ పాకిస్థాన్- అహ్మదాబాద్
అక్టోబర్ 15: ఇంగ్లండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్- ఢిల్లీ
అక్టోబర్ 16: ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక- లక్నో
అక్టోబర్ 17: దక్షిణాఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్ - ధర్మశాల
అక్టోబర్ 18: న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్-చెన్నై
అక్టోబర్ 19: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్- పూణె
అక్టోబర్ 20: ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్థాన్ - బెంగళూరు
అక్టోబర్ 21: నెదర్లాండ్స్ వర్సెస్ శ్రీలంక - లక్నో
అక్టోబర్ 21: ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా- ముంబై
అక్టోబర్ 22: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ – ధర్మశాల
అక్టోబర్ 23: పాకిస్థాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్- చెన్నై
అక్టోబర్ 24: దక్షిణాఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్- ముంబై
అక్టోబర్ 25: ఆస్ట్రేలియా వర్సెస్ నెదర్లాండ్స్-ఢిల్లీ
అక్టోబర్ 26: ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక - బెంగళూరు
అక్టోబర్ 27: పాకిస్థాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా- చెన్నై
అక్టోబర్ 28: ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ - ధర్మశాల
అక్టోబర్ 28: నెదర్లాండ్స్ వర్సెస్ బంగ్లాదేశ్ - కోల్‌కతా
అక్టోబర్ 29: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ - లక్నో
అక్టోబర్ 30: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ శ్రీలంక - పూణే
అక్టోబర్ 31: పాకిస్థాన్ వర్సెస్ బంగ్లాదేశ్- కోల్‌కతా
నవంబర్ 1: న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా- పూణె
నవంబర్ 2: భారత్ వర్సెస్ శ్రీలంక- ముంబై
నవంబర్ 3: నెదర్లాండ్స్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్-లక్నో
నవంబర్ 4: న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్థాన్ - బెంగళూరు
నవంబర్ 4: ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా- అహ్మదాబాద్
నవంబర్ 5: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా - కోల్‌కతా
నవంబర్ 6: బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక- ఢిల్లీ
నవంబర్ 7: ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్- ముంబై
నవంబర్ 8: ఇంగ్లండ్ వర్సెస్ నెదర్లాండ్స్ - పూణె
నవంబర్ 9: న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక - బెంగళూరు
నవంబర్ 10: దక్షిణాఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్- అహ్మదాబాద్
నవంబర్ 11: ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్- పూణె
నవంబర్ 11: ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్థాన్- కోల్‌కతా
నవంబర్ 12: భారత్ వర్సెస్ నెదర్లాండ్స్ - బెంగళూరు
నవంబర్ 15: సెమీఫైనల్ 1- ముంబై
నవంబర్ 16: సెమీఫైనల్ 2- కోల్‌కతా
నవంబర్ 19: ఫైనల్- అహ్మదాబాద్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial