ENG vs AFG: ఈ ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ తొలి సంచలనాన్ని సృష్టించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను ఓడించడం ద్వారా తాము ఏ జట్టునైనా ఓడించగలమని ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ఆఫ్ఘనిస్థాన్ ఇంగ్లండ్‌నే కాకుండా ఆస్ట్రేలియాను కూడా ఇబ్బంది పెట్టింది.
ఈ మ్యాచ్‌కు ముందు ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా జట్టు తొమ్మిదో స్థానంలోనూ, ఆఫ్ఘనిస్తాన్ పదో స్థానంలోనూ ఉంది, అయితే ఇంగ్లండ్‌ను ఓడించి ఆఫ్ఘనిస్తాన్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరుకుంది. ఆస్ట్రేలియా జట్టు అట్టడుగున అంటే పదో స్థానానికి చేరుకుంది.
ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. 49.5 ఓవర్లలో ఆఫ్ఘనిస్థాన్ 284 పరుగులకు ఆలౌట్ అయింది. ఆఫ్ఘనిస్థాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ 140 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో కేవలం 57 బంతుల్లో 80 పరుగులు చేసి జట్టుకు గొప్ప ఆరంభాన్ని అందించాడు. ఆ తర్వాత ఇక్రమ్ అలీఖి కూడా 58 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ కాకుండా రషీద్ ఖాన్ 23 పరుగులతో, ముజీబ్ ఉర్ రెహ్మాన్ 28 పరుగులతో వేగంగా ఇన్నింగ్స్ ఆడారు.
ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్‌లో కూడా అద్భుతాలు చేసింది ముజీబ్ ఉర్ రెహమాన్ 10 ఓవర్లలో 51 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. వీరితో పాటు మహ్మద్ నబీ రెండు, రషీద్ ఖాన్ మూడు వికెట్లు తీసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. ఇంగ్లండ్ తరఫున హ్యారీ బ్రూక్ (66) అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.
ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు పాయింట్ల పట్టికలో పదో స్థానం నుంచి నేరుగా ఆరో స్థానానికి ఎగబాకింది. అదే సమయంలో ఆస్ట్రేలియా జట్టు తొమ్మిదో స్థానం నుంచి పదో స్థానానికి పడిపోయింది. ఇంగ్లండ్ జట్టు తన మూడు మ్యాచ్‌లలో రెండిటిలో ఓడిపోయి కేవలం రెండు పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.
భారత జట్టు తన మూడు మ్యాచ్‌లలో మూడింటిని గెలిచి ఆరు పాయింట్లు సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత న్యూజిలాండ్ నంబర్-2, సౌతాఫ్రికా నంబర్-3, పాకిస్థాన్ నంబర్-4లో స్థానాల్లో ఉన్నాయి.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial