Cricketer Deepti Sharma honoured with post of DSP:  టీమిండియా (Team India) మహిళల జట్టు(Womens Cricket Team) ఆల్‌రౌండర్‌ దీప్తిశర్మ( Deepti Sharma)కు అరుదైన గౌరవం దక్కింది. దీప్తీకి ఉత్తరప్రదేశ్‌(UP) ప్రభుత్వం డీఎస్పీ హోదాను ఇచ్చింది. కొంతకాలంగా భారత జట్టులో నిలకడగా రాణిస్తున్న దీప్తి స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా. లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌( CM Yogi Aditya Nath) దీప్తికి డీఎస్పీ నియామక పత్రంతో పాటు రూ. 3 కోట్ల నగదు బహుమానాన్ని కూడా అందజేశారు. గతేడాది ముగిసిన ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలవడంతో పాటు 2022లో కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో రజతం సాధించిన భారత జట్టులో దీప్తి సభ్యురాలు. ఎక్స్‌ వేదికగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నుంచి డీఎస్పీ నియామక పత్రంతో పాటు నగదు బహుమానాన్ని అందుకుంటున్న ఫోటోలను దీప్తి షేర్‌ చేసింది. 2014లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన దీప్తి.. ఇప్పటివరకూ 194 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 229 వికెట్లు పడగొట్టింది.


WPLకు సమయం ఆసన్నం
భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌ను విజయవంతంగా నిర్వహించిన బీసీసీఐ(BCCI) ఉమెన్స్ ప్రీమియర్‌ లీగ్‌ (WPL)పైనా దృష్టి పెట్టింది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL 2024) రెండో సీజన్‌ షెడ్యూల్ విడుదలైంది.  ఫిబ్రవరి 23 నుంచి రెండో సీజన్‌ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌, రన్నరప్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనున్నాయి. బెంగ‌ళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొలి మ్యాచ్ నిర్వహించ‌నున్నారు. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూర్, యూపీ వారియ‌ర్స్ జ‌ట్ల మ‌ధ్య ఫిబ్రవ‌రి 24న‌ రెండో మ్యాచ్ జ‌రుగునుంది. ఈ సీజన్‌లో మొదటి దశ మ్యాచ్‌లు బెంగళూరులో రెండో దశ మ్యాచ్‌లు ఢిల్లీలో జరగనున్నాయి.  ఎలిమినేటర్‌, ఫైనల్‌ కలిపి మొత్తం 22 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మార్చి 17న ఢిల్లీలో ఫైనల్ మ్యాచ్‌ ఉంటుంది. తొలి సీజ‌న్‌లో ముంబైకే ప‌రిమిత‌మైన డ‌బ్ల్యూపీఎల్‌.. రెండో సీజ‌న్‌లో రెండు న‌గ‌రాల్లో జ‌రుగ‌నుంది.



WPL 2024 షెడ్యూల్‌....
ఫిబ్రవరి 23- ముంబయి ఇండియన్స్ v ఢిల్లీ క్యాపిటల్స్ (బెంగుళూరు)
ఫిబ్రవరి 24- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs యూపీ వారియర్స్ (బెంగుళూరు)
ఫిబ్రవరి 25- గుజరాత్ జెయింట్స్ vs ముంబయి ఇండియన్స్ (బెంగుళూరు)
ఫిబ్రవరి 26- యూపీ వారియర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (బెంగుళూరు)
ఫిబ్రవరి 27- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్ (బెంగుళూరు)
ఫిబ్రవరి 28- ముంబయి ఇండియన్స్ vs యూపీ వారియర్స్ (బెంగుళూరు)
ఫిబ్రవరి 29- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్ (బెంగుళూరు)
మార్చి 1- యూపీ వారియర్స్ vs గుజరాత్ జెయింట్స్ (బెంగుళూరు)
మార్చి 2- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబయి ఇండియన్స్ (బెంగుళూరు)
మార్చి 3- గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (బెంగుళూరు)
మార్చి 4- యూపీ వారియర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (బెంగుళూరు)
మార్చి 5- ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబయి ఇండియన్స్ (ఢిల్లీ)
మార్చి 6- గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఢిల్లీ)
మార్చి 7- యూపీ వారియర్స్ vs ముంబయి ఇండియన్స్ (ఢిల్లీ)
మార్చి 8- ఢిల్లీ క్యాపిటల్స్ vs యూపీ వారియర్స్ (ఢిల్లీ)
మార్చి 9- ముంబయి ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్ (ఢిల్లీ)
మార్చి 10- ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఢిల్లీ)
మార్చి 11- గుజరాత్ జెయింట్స్ vs యూపీ వారియర్స్ (ఢిల్లీ)
మార్చి 12- ముంబయి ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఢిల్లీ)
మార్చి 13- ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ (ఢిల్లీ)
మార్చి 15- ఎలిమినేటర్ (ఢిల్లీ)
మార్చి 17- ఫైనల్ (ఢిల్లీ)