ఐర్లాండ్‌తో జరిగిన షాక్ ఓటమి బాధించినప్పటికీ, ఆటగాళ్ళు ఆ షాక్ నుంచి త్వరగా తేరుకుని ముందుకు వెళ్లే మార్గంపై దృష్టి సారించారని పాకిస్తాన్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన స్టార్ ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అన్నాడు. ఆదివారం మెల్‌బోర్న్‌లో ఇంగ్లండ్‌కి రెండో టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను అందించటానికి స్టోక్స్ తన చాలా కష్టపడ్డాడు. "అది (ఐర్లాండ్‌తో ఓటమి) పోటీలో చాలా ముందుగానే జరిగింది." అని 2019 ఇంగ్లండ్ ప్రపంచ కప్ విజయంలో కూడా కీలక పాత్ర పోషించిన స్టోక్స్ చెప్పాడు.
"ఇలాంటి టోర్నమెంట్‌లలో మీరు మీతో ఓటమిని మోస్తూ తీసుకువెళ్లలేరు. అది చాలా కష్టం. మమ్మల్ని ఓడించడం ఐర్లాండ్ ఘనత. కానీ అత్యుత్తమ జట్లు తమ తప్పుల నుండి నేర్చుకుంటాయి. వాటి ప్రభావాన్ని తమ మీద పడనివ్వవు" అని స్టోక్స్ అన్నాడు.
ఈ సంవత్సరం ప్రారంభంలో వైట్-బాల్ కెప్టెన్‌గా ఉన్న ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌ను, పరిమిత ఓవర్ క్రికెట్‌లో బెంచ్‌మార్క్‌ను సెట్ చేసిన అతని జట్టును అందరూ ప్రశంసించారు. ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ గెలవడం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఎంతో గర్వంగా ఉందని బట్లర్ అన్నాడు.
"ఇది ఒక అద్భుతమైన టోర్నమెంట్. మేము ఇక్కడికి రాకముందు పాకిస్తాన్‌కి వెళ్లాము. ఐర్లాండ్ మ్యాచ్ తర్వాత టోర్నీలో ముందుకు వెళ్లడం చాలా కష్టం అనిపించింది. కానీ తప్పనిసరిగా గెలవాల్సిన గేమ్‌లలో మేం చూపించిన పాత్ర అద్భుతమైనది. ఈ టోర్నమెంట్‌లో మాతో పాటు కోచింగ్ స్టాఫ్‌లో కొంతమంది ఆస్ట్రేలియన్లు ఉన్నారు. కోచ్ మ్యాటీ మోట్స్ కోచింగ్ సిబ్బందిని బాగా నడిపించాడు. ఆటగాళ్లకు గొప్ప స్వేచ్ఛను ఇచ్చాడు." అని బట్లర్ తెలిపాడు. శామ్ కరన్‌తో పాటు ఫైనల్‌తో సహా టోర్నమెంట్ అంతటా మిడిల్ ఓవర్లలో వికెట్లను అందించిన లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌ను కూడా బట్లర్ ప్రశంసించాడు.