2022 టీ20 ప్రపంచకప్‌కు ఐసీసీ 5.6 మిలియన్ డాలర్ల (సుమారు రూ.45.08 కోట్లు) ప్రైజ్ మనీని ప్రకటించింది. ఈ టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరుకున్న టీమిండియా దగ్గర నుంచి విజేతగా నిలిచిన ఇంగ్లండ్ వరకు అందరూ గెలుచుకున్న క్యాష్ ప్రైజ్‌కు సంబంధించిన వివరాలు ఇవే.

విజేతలు: ఇంగ్లండ్ తన రెండో టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. 2010లో పొట్టి ఫార్మాట్‌లో జగజ్జేతగా నిలిచిన అనంతరం ఇంగ్లండ్ ఈ కప్ గెలవడం ఇదే మొదటిసారి. దాదాపుగా 12 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ ఇంగ్లండ్ ట్రోఫీని ముద్దాడింది. సూపర్-12 గ్రూప్-1లో టాప్ పొజిషన్‌లో నిలిచిన ఇంగ్లండ్ 1.6 మిలియన్ డాలర్లను (సుమారు రూ.12.88 కోట్లు) గెలుచుకుంది.

రన్నరప్: బాబర్ ఆజం నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు టీ20 ప్రపంచ కప్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచినందుకు ఎనిమిది లక్షల డాలర్లను (సుమారు రూ.6.44) బహుమతిగా పొందింది.

ఓడిపోయిన సెమీ ఫైనలిస్టులు: సెమీ ఫైనల్స్‌‌లో ఓడిపోయిన టీమ్ ఇండియా, న్యూజిలాండ్ తలో నాలుగు లక్షల డాలర్లను (సుమారు రూ.3.22 కోట్లు) అందుకున్నాయి.

సూపర్-12 దశలో నిష్క్రమించిన జట్లు: సూపర్-12 దశలోనే టోర్నమెంట్ నుండి నిష్క్రమించిన ఎనిమిది జట్లు తలో 70 వేల డాలర్లను (సుమారు రూ.56.35 లక్షలు) అందుకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్లు సూపర్-12 నుంచి ఇంటి బాట పట్టాయి.

ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్: ఈ రేసులో మొత్తం తొమ్మిది మందిని ఫైనల్‌కు ముందు ఐసీసీ నామినీలుగా ప్రకటించింది. వీరిలో ఇంగ్లండ్ చిచ్చరపిడుగు శామ్ కరన్ అవార్డును ఎంచుకున్నాడు.

టీ20 ప్రపంచకప్‌లో రికార్డులుఅత్యధిక పరుగులు - విరాట్ కోహ్లీ (296 పరుగులు)అత్యధిక వికెట్లు - వనిందు హసరంగ (15 వికెట్లు)అత్యధిక అర్థ సెంచరీలు - విరాట్ కోహ్లీ (నాలుగు)అత్యధిక సెంచరీలు - గ్లెన్ ఫిలిప్స్, రిలీ రౌసో (ఒకటి)అత్యధిక సిక్సర్లు - సికందర్ రాజా (11)అత్యధిక ఫోర్లు - సూర్యకుమార్ యాదవ్ (26)అత్యధిక మెయిడెన్ ఓవర్లు - భువనేశ్వర్ కుమార్ (3)