జోస్ బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ ఆదివారం పాకిస్థాన్‌పై విజయాన్ని నమోదు చేసి రెండో టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో ఇంగ్లాండ్ తరపున బెన్ స్టోక్స్ అజేయంగా (49 బంతుల్లో 52 నాటౌట్) నిలిచాడు. బట్లర్ బృందం ఐకానిక్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో గెలిచి రెండోసారి పొట్టి ఫార్మాట్‌లో ప్రపంచ విజేతలుగా నిలిచారు.


టీ20 ప్రపంచ కప్ యొక్క 2022 ఎడిషన్‌లో విజేతలుగా నిలిచిన జట్టు 1.6 మిలియన్ డాలర్ల (సుమారు రూ.12.88 కోట్లు) ప్రైజ్ మనీని పొందుతారని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) వెల్లడించింది. దీంతో ఛాంపియన్‌గా నిలిచిన ఇంగ్లండ్ 1.6 మిలియన్ డాలర్ల మొత్తాన్ని అందుకుంది. అయితే బాబర్ నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచినందుకు ఎనిమిది లక్షల డాలర్లను (సుమారు రూ.6.44) బహుమతిగా పొందింది.


సెమీ ఫైనలిస్టులు టీమ్ ఇండియా, న్యూజిలాండ్ తలో నాలుగు లక్షల డాలర్లను (సుమారు రూ.3.22 కోట్లు) అందుకున్నాయి. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్ ఇండియాను ఓడించి ఇంగ్లండ్ ప్రపంచకప్‌లో ఫైనల్‌లోకి ప్రవేశించగా, బాబర్ నేతృత్వంలోని పాకిస్తాన్ సెమీ ఫైనల్లో కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్‌ను ఓడించింది. సూపర్ 12 దశలో టోర్నమెంట్ నుండి నిష్క్రమించిన మొత్తం ఎనిమిది జట్లు తలో 70 వేల డాలర్లను (సుమారు రూ.56.35 లక్షలు) అందుకున్నాయి.


సూపర్ 12 దశలో జరిగిన మ్యాచ్‌ల్లో విజేతలుగా నిలిస్తే  40 వేల డాలర్లు (సుమారు రూ.32.2 లక్షలు) లభించనున్నాయి. మొదటి రౌండ్‌లో నాక్ అవుట్ అయిన నాలుగు జట్లూ ఒక్కొక్కటి తా 40  వేల డాలర్లు (సుమారు రూ.32.2 కోట్లు) అందుకోనున్నాయి. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా నేరుగా టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 12 దశలోకి ప్రవేశించాయి.