T20 World Cup 2024: ఈ సంవత్సరం టీ20 ప్రపంచకప్‌ను కోల్పోయినప్పటి నుండి, భారత జట్టుపై నిరంతరం అనేక విమర్శలు తలెత్తుతున్నాయి. భారత క్రికెట్ బోర్డు నుంచి కూడా జట్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది.


తదుపరి టీ20 ప్రపంచ కప్ (2024) కోసం కొందరు ఆటగాళ్లను పూర్తిగా జట్టుకు దూరంగా ఉంచాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.


ఈ ఆటగాళ్లు టీ20 ప్రపంచ కప్ 2024 ప్లాన్స్‌లో లేరు
2024లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ పెద్ద నిర్ణయం తీసుకుంది. తదుపరి టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి రవిచంద్రన్ అశ్విన్‌, మహమ్మద్‌ షమీ, దినేశ్‌ కార్తీక్‌, భువనేశ్వర్‌ కుమార్‌ పూర్తిగా దూరమయ్యారని బోర్డు పేర్కొంది. వీరితో పాటు ప్రస్తుత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ పేరు కూడా చేరింది. అయితే ఇందులో విరాట్ కోహ్లి పేరు లేకపోవడం చూడాల్సిన విషయం.


ఈ ఏడాది ఎలా ఆడారంటే?
విశేషమేమిటంటే ఈ సంవత్సరం భారత జట్టు 40 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడింది, ఇందులో జట్టు 28 మ్యాచ్‌లు గెలిచి 10 మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఒక మ్యాచ్ టై అయ్యింది. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో ఓడిపోయింది.


 వెస్టిండీస్‌, శ్రీలంక, ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ జట్లపై సిరీస్‌ గెలిచిన జట్టు ఆసియా కప్‌, టీ20 ప్రపంచకప్‌ వంటి పెద్ద టోర్నీల్లో ముఖ్యమైన మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆసియా కప్‌లో సూపర్-4లో పాకిస్థాన్, శ్రీలంకపై టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది.