2022 ఐపీఎల్ సీజన్‌లో రూ.16 కోట్లతో న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్‌ను సన్‌రైజర్స్ రిటైన్ చేసుకుంది. అయితే ఆ సీజన్‌లో కేన్ మామ రాణించలేకపోయాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా కూడా విఫలం కావడంతో తనను సన్‌రైజర్స్ జట్టు నుంచి తప్పించింది. ఐపీఎల్ 2023 మినీ వేలంలో కేన్ విలియమ్సన్‌ను రూ.2 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. తనను వన్ డౌన్ బ్యాటర్‌గా ఉపయోగించనున్నట్లు కోచ్ ఆశిష్ నెహ్రా ఇప్పటికే స్పష్టం చేశాడు.


అయితే ఇలా వేలం పూర్తయిందో లేదో అలా కేన్ మామ ఫాంలోకి వచ్చేశాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించాడు. 395 బంతుల్లో 21 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 200 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. టెస్టులకి, టీ20లకు చాలా తేడా ఉన్నప్పటికీ, కేన్ లాంటి క్లాస్ ఉన్న ఆటగాడికి ఇలా ఫాంలోకి రావడం బూస్ట్ ఇస్తుంది.


2017 ఐపీఎల్ సీజన్‌లో కేన్ విలియమ్సన్ ఆరెంజ్ క్యాప్‌ను కూడా గెలుచుకున్నాడు. 2021లో వార్నర్‌ను కూడా ఇలానే సన్‌రైజర్స్ వదిలేసింది. కానీ వెంటనే అతను టీ20 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆప్ ది సిరీస్‌గా నిలిచి విమర్శకుల నోళ్లు మూయించాడు.