Most Paid Players In IPL History: ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ విజయవంతమైన జట్టు. అదే సమయంలో ఈ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అత్యధిక మొత్తం అందుకున్న ఆటగాడిగా మారాడు.. నిజానికి రోహిత్ శర్మ 2011 నుంచి ముంబై ఇండియన్స్‌తో అనుబంధం కలిగి ఉన్నాడు. అంతకుముందు రోహిత్ శర్మ డెక్కన్ ఛార్జర్స్‌లో జట్టులో ఉన్నాడు.


అన్ని ఐపీఎల్ సీజన్లు కలిపితే అత్యధికంగా సంపాదిస్తున్న ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. ఈ సందర్భంలో ఐపీఎల్‌లో భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని రోహిత్ శర్మ దాటేశాడు. ఇప్పటివరకు రోహిత్ శర్మ ఐపీఎల్ ద్వారా రూ.178.6 కోట్లు సంపాదించాడు.


మహేంద్ర సింగ్ ధోనీని దాటిన రోహిత్ శర్మ
16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మొత్తం రూ.178.6 కోట్లు సంపాదించాడు. కాగా మహేంద్ర సింగ్ ధోనీ 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో రూ.176.84 కోట్లు సంపాదించాడు. దీంతో పాటు విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా పేర్లు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నాయి.


ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు రూ.173.2 కోట్లు సంపాదించాడు. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు సురేశ్ రైనా నాలుగో స్థానంలో ఉన్నాడు. సురేష్ రైనా 14 ఏళ్లలో లీగ్ ద్వారా రూ.110.7 కోట్లు సంపాదించాడు.


ఐపీఎల్‌లో రోహిత్ శర్మ ప్రయాణం
నిజానికి 2008లో జరిగిన ఐపీఎల్ తొలి ఎడిషన్‌లో డెక్కన్ ఛార్జర్స్ రోహిత్ శర్మను రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది. రోహిత్ శర్మ తరువాతి రెండు సీజన్లలో రూ.మూడేసి కోట్లను వేతనంగా పొందాడు. అయితే 2011 సంవత్సరంలో ముంబై ఇండియన్స్ రూ. 9.2 కోట్లకు రోహిత్ శర్మను కొనుగోలు చేసింది.


ముంబై ఇండియన్స్ 2014 సంవత్సరంలో రోహిత్ శర్మను రూ.12.5 కోట్లతో రిటెయిన్ చేసుకుంది. ముంబై ఇండియన్స్ 2018 సంవత్సరంలో రోహిత్ శర్మకు రూ.15 కోట్ల రూపాయలు చెల్లించింది. IPL 2022 వేలంకి ముందు ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను రూ.16 కోట్లకు రిటెయిన్ చేసుకుంది.