ముంబై: ఆసియా కప్ 2025 కోసం టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ జట్టుకు ఆసియా కప్‌లో కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇటీవల అక్షర్ పటేల్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా చేశాడు. ఆసియా కప్‌లో జస్ప్రీత్ బుమ్రా టీమ్ ఇండియా ప్రధాన బౌలర్‌గా ఆడనున్నాడు. వైట్ బాల్ ఫార్మాట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్న శ్రేయాస్ అయ్యర్‌ను 15 మంది జట్టు (Shreyas Iyer Dropped) లో అవకాశం ఇవ్వలేదు. మహ్మద్ సిరాజ్‌కు గాయం కావడంతో విశ్రాంతి ఇచ్చారు. ఒకవేళ సిరాజ్ అందుబాటులో ఉంటే బుమ్రా రెస్ట్ కోరాడని సమాచారం.
ఆసియా కప్ కోసం భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మాన్ గిల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్, హర్షిత్ రాణా, రింకు సింగ్
స్టాండ్‌బైలు: ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్.
"యశస్వి జైస్వాల్ బాగా ఆడుతున్నప్పటికీ చాలా దురదృష్టకరం. మరోవైపు అభిషేక్ వర్మ బాగా రాణిస్తున్నాడు. అవసరమైతే బౌలింగ్ చేయగలడు. అందుకే ఇద్దరిలో ఒకరు ఈ అవకాశాన్ని కోల్పోయారు. శ్రేయస్ అయ్యర్ విషయంలో కూడా అదే జరిగింది. అతడి తప్పేమీ లేదు" అని సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ అన్నారు. ఆసియా కప్ కోసం టీమిండియాకు ముగ్గురు ఓపెనర్లలో శుభ్‌మాన్ గిల్ ఒకడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ లలో ఒకరు ఓపెనింగ్ చేస్తారు.
జట్టు ప్రస్తుత పరిస్థితుల్లో యశస్వి జైస్వాల్‌కు ఛాన్స్ లేదు. జస్ప్రిత్ బుమ్రా మెయిన్ బౌలర్‌గా ఆసియా కప్‌లో జట్టును నడిపించనున్నాడు. తాజా నిర్ణయంతో అతని ఫిట్‌నెస్‌పై సందేహాలను కూడా తొలగిస్తుంది. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో అంతగా ప్రదర్శన చేయని ప్రసిద్ కృష్ణ కంటే హర్షిత్ రాణాకు ప్రాధాన్యత ఇచ్చారు. గత ఏడాది నుంచి తక్కువ పరుగులే చేసినప్పటికీ, రింకు సింగ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
2025 ఆసియా కప్‌లో భారత్ మ్యాచ్‌ల షెడ్యూల్
సెప్టెంబర్ 10: IND vs UAE (దుబాయ్) - రాత్రి 7:30 నుండి
సెప్టెంబర్ 14: IND vs PAK (దుబాయ్) - రాత్రి 7:30 నుండి
సెప్టెంబర్ 19: IND vs OMAN (అబుదాబి) - రాత్రి 7:30 నుండి
ఆసియా కప్ 2025లో ఆడే జట్లు
సెప్టెంబర్ 9 నుండి సెప్టెంబర్ 28 వరకు ఆసియా కప్‌లో 8 జట్ల మధ్య మొత్తం 19 మ్యాచ్‌లు జరుగుతాయి. 8 జట్లను 2 గ్రూపులుగా విభజించారు. అది ఈ క్రింది విధంగా ఉంది.
గ్రూప్ A: భారతదేశం, పాకిస్తాన్, ఒమన్, యూఏఈ
గ్రూప్ B: ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, హాంకాంగ్