India Playing 11 Team List for Asia Cup 2025: 2025 ఆసియా కప్ సెప్టెంబర్ 9న ప్రారంభమవుతుంది. టీమ్ ఇండియా తన ప్రయాణాన్ని సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభిస్తుంది. ఈసారి ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. అబుదాబి, దుబాయ్‌లలో అన్ని మ్యాచ్‌లు జరుగుతాయి. పిచ్, పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో 3 స్పిన్నర్లు, 2 ఫాస్ట్ బౌలర్లను ఆడించే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా మూడో ఫాస్ట్ బౌలర్‌గా బౌలింగ్ చేయనున్నారు. ఈ విధంగా, భారత్ 6 బౌలింగ్ ఆప్షన్‌తో జట్టును సిద్ధం చేయనుంది.
ముందుగా, 2025 ఆసియా కప్ కోసం BCCI ఇంకా టీమ్ ఇండియాను ప్రకటించలేదు. నివేదికల ప్రకారం, ఆగస్టు 19, మంగళవారం నాడు జట్టు ప్రకటిస్తారు. అంతకు ముందే, టీమ్ ఇండియా సాధ్యమైన ప్లేయింగ్ ఎలెవన్ గురించి మీకు తెలియజేస్తున్నాం.
ఈ ఆటగాళ్లను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చవచ్చు
వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ సంజు శామ్సన్, టీ20 నంబర్-1 బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు. చాలా నివేదికలు శాంసన్‌ను జట్టు నుంచి తప్పించవచ్చనే విశ్లేషణలు చేస్తున్నాయి. అయితే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ ఆటగాడి ప్రతిభ బాగా తెలుసు. కాబట్టి సంజూకి అవకాశం రావడం ఖాయంగా కనిపిస్తోంది. మూడు నంబర్‌లో శ్రేయాస్ అయ్యర్ లేదా తిలక్ వర్మలో ఒకరు ఆడవచ్చు. తిలక్ చాలా కాలంగా టీ20 జట్టులో భాగం, అయితే అయ్యర్ IPL 2025లో 600 కంటే ఎక్కువ పరుగులు చేసి తన స్థానాన్ని పటిష్ట పరుచుకున్నాడు. .
మిడిల్ ఆర్డర్ ఇలా ఉండవచ్చు
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నంబర్ నాలుగులో ఆడటం ఖాయం. ఆ తర్వాత ఐదో స్థానంలో అక్షర్ పటేల్ కనిపించవచ్చు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా ఆడటం కూడా ఖాయం. ఏడో స్థానంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ జితేశ్ శర్మ కనిపించవచ్చు. IPL 2025లో అతను ఒక బలమైన ఫినిషర్‌గా ఎదిగాడు. కాబట్టి, భారత మేనేజ్‌మెంట్ అతనికి ఏడో స్థానంలో అవకాశం ఇవ్వవచ్చు.
బౌలింగ్ గురించి మాట్లాడితే, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ ప్రధాన ఇద్దరు స్పిన్నర్లు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండవచ్చు. అక్షర్ పటేల్ మూడో స్పిన్నర్ పాత్ర పోషిస్తాడు. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ ఇద్దరు ప్రధాన ఫాస్ట్ బౌలర్లు అవుతారు. హార్దిక్ పాండ్యా మూడో ఫాస్ట్ బౌలర్ పాత్ర పోషిస్తాడు.
ఆసియా కప్ కోసం టీమ్ ఇండియా యొక్క సాధ్యమైన ప్లేయింగ్ ఎలెవన్- సంజు సామ్సన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ/శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ/శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.