Ireland Trolls Bazball After England's Defeat In First Test: క్రికెట్ లో ఎంతో ప్రత్యేక ఉన్న యాషెస్ సిరీస్ ను ఓటమితో మొదలుపెట్టింది ఆతిథ్య ఇంగ్లాండ్. తొలి టెస్టులో ఇంగ్లండ్ బాజ్ బాల్ ఫార్ములాను బ్రేక్ చేసిన ఆస్ట్రేలియా సంచలన రీతిలో తొలి టెస్టు మ్యాచ్ నెగ్గింది. అయితే బాజ్ బాల్ ఫార్ములాను వాడుతూ తొలి ఇన్నింగ్స్ లో కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ను 8 వికెట్ల వద్ద డిక్లెర్ చేయడం తెలిసిందే. కానీ ఇంగ్లాండ్ తో టెస్టు మ్యాచ్ లో చివరి రోజు ఉత్కంఠ పోరులో ఆసీస్ విజయం సాధించిన తరువాత బాజ్ బాల్ పై ట్రోల్స్ వైరల్ చేస్తున్నారు.
వాస్తవానికి ఇంగ్లాండ్ నిర్ణయం సరైనదని మాజీలు కొందరు మద్దతు తెలిపారు. కానీ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్, టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ మాత్రం బాజ్ బాల్ ఫార్మూలాను వాడాల్సిన అవసరం లేదన్నారు. చివరి ఇన్నింగ్స్ లో ఆసీస్ 281 చేస్తే విజయం సాధిస్తుంది. ఓ దశలో 7 వికెట్ల నష్టానికి 209 పరుగులతో ఉంది. ఫస్ట్ ఇన్నింగ్స్ సెంచరీ హీరో ఉస్మాన్ ఖవాజా 65 పరుగులకు ఔటై 8 వికెట్ గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన ఆసీస్ కెప్టెన్ అద్భుతం చేశాడు. 44 పరుగులతో నాటౌట్ గా నిలిచి యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియాను విజేతగా నిలిపాడు. నాథన్ లియాన్ సైతం ఇంగ్లీష్ బౌలర్లను ఎదుర్కొని కీలకపరుగులు రాబట్టాడు. నిన్న అర్ధరాత్రి టెస్టు మ్యాచ్ లో ఆసీస్ విజయం సాధించాక ఇంగ్లాండ్ బాజ్ బాల్ మంత్రం ఫెయిల్ అయిందంటూ ట్రోలింగ్ మొదలైంది.
అసలు బాజ్ బాల్ అంటే ఏంటి..?
2022 మేలో బ్రెండన్ మెక్ కల్లమ్ ఇంగ్లండ్ టెస్ట్ కోచ్ గా వచ్చాడు. అతడి నుంచి ఈ పేరు వచ్చిందని చెప్పవచ్చు. కివీస్ మాజీ ప్లేయర్ మెక్ కల్లమ్ ఆడే రోజుల్లో అతని నిక్ నేమ్ బాజ్. బాజ్ కోచింగ్ లో ఇంగ్లండ్ టెస్టుల్లో ఆడబోయే పాజిటివ్, అటాకింగ్ ఆటతీరుకు ఈ బాజ్ బాల్ అనే పేరును పెట్టారు. ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోలో ఓ జర్నలిస్ట్ తొలిసారిగా ఈ బాజ్ బాల్ అనే పదాన్ని ప్రయోగించారు. తరువాత ఇంగ్లాండ్ వరుస విజయాలు సాధించడంతో బాజ్ బాల్ అనే పదాన్ని బాగా వాడేస్తున్నారు.
ఇంగ్లాండ్ క్రికెటర్లు బాజ్ బాల్ ప్రయత్నంలో బ్యాట్, బాల్ ను ఫోకస్ చేయలేదని ట్రోలింగ్ చేస్తున్నారు.
బెన్ స్టోక్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఫలితం తిరగబెట్టింది. బాజ్ బాల్ కు హైప్ తీసుకొచ్చి తొలి టెస్టులో ఓడిపోయారని కొందరు ఫ్యాన్స్ మీమ్స్ వైరల్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ను ఓడించలేదని, బాజ్ బాల్ ఓవర్ కాన్ఫిడెన్స్ ను చిత్తు చేశారన్న మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
జో రూట్ 118 రన్స్ తో ఆడుతుండగా తొలి రోజే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంపై మీమర్లు చెలరేగుతున్నారు. బాజ్ బాల్ అంట అని ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ నవ్వుతున్న ఫొటో పోస్ట్ చేయగా ట్రెండింగ్ అవుతోంది.
ఐస్ ల్యాండ్ క్రికెట్ బోర్డు అధికారిక ట్విట్టర్ లో ట్రోల్ చేసింది. బాజ్ బాల్ 0-1 బేసిక్ కామన్ సెన్స్ అని పోస్ట్ చేయగా లైక్స్, షేర్లతో వైరల్ మారింది.
ఇంగ్లాండ్ క్రికెటర్లు బాజ్ బాల్ కారుతో రాగా, ఆసీస్ ఆటగాళ్లు దాన్ని పంక్చర్ చేసినట్లు ట్రోలింగ్ జరుగుతోంది.
ఆస్ట్రేలియాకు తెలిసిన బాజ్ బాల్ ఇదేనని వీడియో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. వాళ్ల ఫోకస్ ఎప్పుడూ బాల్ మీద ఉంటుందని అని క్లిప్పింగ్ ట్రెండింగ్ లో ఉంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial