BAN vs AFG Asia Cup 2023: ఆసియా కప్ వేటలో ఈసారైనా రాణించి ప్రపంచకప్‌కు ఉత్సాహంగా అడుగిడాలనుకుంటున్న బంగ్లాదేశ్.. నేడు అఫ్గానిస్తాన్‌తో కీలకపోరులో తలపడుతున్నది. లాహోర్ లోని గడాఫీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో షకిబ్ అల్ హసన్ సారథ్యంలోని బంగ్లాదేశ్.. అఫ్గానిస్తాన్‌తో ఆడనున్నది. టోర్నీలో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ నెగ్గింది. టాస్ గెలిచిన బంగ్లా సారథి షకిబ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ టోర్నీలో ఇదివరకే శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో దారుణంగా ఓడిన బంగ్లా.. నేటి పోరులో కూడా ఓడితే ఇంటిదారి పట్టాల్సిందే. మరోవైపు అఫ్గానిస్తాన్‌కు ఆసియా కప్‌లో ఇదే తొలి మ్యాచ్.
కీలక మ్యాచ్ కావడంతో బంగ్లాదేశ్ మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఇక అఫ్గానిస్తాన్ ఇద్దరు సీమ్ ఆల్ రౌండర్లు, ఒక సీమర్, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది.
శ్రీలంకతో మ్యాచ్‌లో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ లో కూడా విఫలమైన బంగ్లాదేశ్ నేటి మ్యాచ్‌లో పుంజుకోవడం అత్యంత ఆవశ్యకం. బ్యాటింగ్‌లో ఆ జట్టు గత మ్యాచ్‌లో నజ్ముల్ శాంటో ఒక్కడే ఉన్నంతలో కాస్త మెరుగ్గా ఆడాడు. సీనియర్లు షకిబ్ అల్ హసన్‌తో పాటు ముష్ఫీకర్ రహీమ్‌లు నేటి మ్యాచ్‌లో విజృంభించకుంటే బంగ్లాకు కష్టాలు తప్పవు.
2008 తర్వాత లాహోర్‌లో తొలి వన్డే ఆడుతున్న బంగ్లాదేశ్.. పాకిస్తాన్‌లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న అఫ్గాన్‌లకు లాహోర్ పిచ్ కొత్తదే. బ్యాటర్లతో పాటు స్పిన్‌కు అనుకూలించే పిచ్ పై అఫ్గాన్ స్పిన్నర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్‌లను ఎదుర్కోవడం బంగ్లా బ్యాటర్లకు సవాలే.
తుది జట్లు :
అఫ్గానిస్తాన్ : రెహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిది (కెప్టెన్), నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నయీబ్, కరీమ్ జనత్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ ఫరూఖీ
బంగ్లాదేశ్ : మహ్మద్ నయీం, నజ్ముల్ హోసెన్ శాంటో, షకిబ్ అల్ హసన్ (కెప్టెన్), తౌహిద్ హృదయ్, శామిమ్ హోసేన్, ముష్ఫీకర్ రహీమ్, అఫిఫ్ హోసెన్, మెహిది హసన్, టస్కిన్ అహ్మద్, హసన్ మహ్మద్, షోరిఫుల్ ఇస్లాం
లైవ్ చూడటమిలా..
- ఈ మ్యాచ్‌ను టెలివిజన్‌లో స్టార్ నెట్వర్క్స్‌తో పాటు మొబైల్స్‌లో అయితే డిస్నీ హాట్ స్టార్‌లలో ఉచితంగా చూడొచ్చు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial