Axar Patel Instagram Post: 
వన్డే ప్రపంచ కప్ లో ఆడటం అనేది క్రికెటర్ల కల. మెగా టోర్నీలో పాల్గొని దేశానికి వరల్డ్ కప్ అందించాలని ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతుంటారు. వచ్చే నెలలో వన్డే ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. అయితే మెగా టోర్నీకి ఎంపికైన  లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ గాయం కారణంగా దూరమయ్యాడు. అక్షర్ పటేల్ స్థానంలో ఆఫ్ స్పిన్నర్, వెటరన్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ ను జట్టులోకి తీసుకున్నారు. ఈ మేరకు బీసీసీఐ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.


అక్సర్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ.. 
ఆసియా కప్ ఆడుతూ గాయపడ్డ అక్షర్ పటేల్ ను వన్డే వరల్డ్ కప్ నుంచి తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అతడి స్థానంలో అశ్విన్ ను రీప్లేస్ చేసింది. కానీ జరిగిణ పరిణామాలపై అక్షర్ పటేల్ చాలా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. తాను కామర్స్ కు బదులుగా సైన్స్ సబ్జెక్స్ తీసుకుని ఉండాల్సి ఉంది. మంచి పీఆర్ ను నియమించుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదంటూ ఇన్ స్టాగ్రామ్ స్టోరీ పోస్ట్ చేశాడు అక్షర్ పటేల్. మరో ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఓ అస్తి పంజరం కత్తెరతో గుండెను కోసేస్తున్నట్లు పోస్ట్ చేశాడు. అంతలోనే ఏం జరిగిందో తెలియదు కానీ అక్షర్ పటేల్ తాను పోస్ట్ చేసిన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలను వెంటనే డిలీట్ చేశాడు. అయితే అప్పటికే ఇవి చూసిన నెటిజన్లు వాటిని స్క్రీన్ షాట్లు తీసి పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 


ఆసియా కప్ 2023లో బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్-4 స్టేజ్ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ గాయపడ్డాడని తెలిసిందే. మొదట అక్షర్ గాయం చిన్నదేనని వరల్డ్ కప్ లోపు అందుబాటులోకి వస్తాడనుకున్నారు. కానీ అక్షర్ ఇంకా కోలుకోలేదని, మెగా టోర్నీకి అతడి స్థానంలో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ను తీసుకున్నట్లు మేనేజ్ మెంట్ ప్రకటించింది. సీనియర్ ఆటగాడు అశ్విన్ ఇటీవల ఎక్కువగా వన్డే మ్యాచ్ లు ఆడలేదు.


గత ఏడాది జనవరి తరువాత ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో జట్టులోకి పునరాగమనం చేశాడు అశ్విన్. 22 సగటుతో 4 వికెట్లు పడగొట్టి రాణించడంతో అక్షర్ పటేల్ కు ప్రత్యామ్నాయంగా వెటరన్ అశ్విన్ కు ఛాన్స్ ఇచ్చారు. కానీ ఈ నిర్ణయంపై అక్షర్ పటేల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అతడి ఇన్ స్టాగ్రామ్ స్టోరీ చూసిన వాళ్లు అక్షర్ కోలుకునే అవకాశం ఉన్నా, మేనేజ్ మెంట్ తొందర పడి నిర్ణయం తీసుకుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్షర్ పటేల్ తో మాట్లాడి మేనేజ్ మెంట్, కెప్టెన్ రోహిత్ శర్మ ఈ నిర్ణయం తీసుకుందా లేదా అనేది హాట్ టాపిక్ అవుతోంది.






అశ్విన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. తన స్థానంలో ప్రపంచ కప్ జట్టులోకి వచ్చింది కూడా అశ్విన్. దాంతో కొందరి పీఆర్ టీమ్ చేసిన ప్రమోషన్స్ కారణంగానే తనకు వరల్డ్ కప్ ఆడే ఛాన్స్ మిస్ అయిందని అక్షర్ పటేల్ బాధపడుతున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ వివాదానికి బీసీసీఐ మేనేజ్ మెంట్ ఎలా చెక్ పెడుతుందనేది ఆసక్తికరంగా మారింది.


వరల్డ్‌ కప్‌ భారత తుది జట్టు


రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.