2023 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ టార్గెట్‌ను న్యూజిలాండ్ ముందు ఉంచుంది. ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఆది నుంచి ఆస్ట్రేలియా దూకుడుగా ఆడింది. ఆఖరిలో తడబడినప్పటికీ న్యూజిలాండ్‌కు 389 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ట్రావిస్‌ సెంచరీతో వార్నర్‌ హాఫ్‌ సెంచరీతో కదం తొక్కారు. గ్లెన్ మ్యాక్స్వెల్, ప్యాట్ కమిన్స్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా భారీ టార్గెట్‌ను ఇచ్చింది.

  


2023 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ టార్గెట్‌ను న్యూజిలాండ్ ముందు ఉంచుంది. ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఆది నుంచి ఆస్ట్రేలియా దూకుడుగా ఆడింది. ఆఖరిలో తడబడినప్పటికీ న్యూజిలాండ్‌కు 389 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ట్రావిస్‌ సెంచరీతో వార్నర్‌ హాఫ్‌ సెంచరీతో అదరగొట్టారు. 


హిమాచల్ క్రికెట్ స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు ట్రావిస్ హెడ్ (67 బంతుల్లో 109 పరుగులు), డేవిడ్ వార్నర్ (65 బంతుల్లో 81 పరుగులు) 389 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. హెడ్, వార్నర్ 19.1 ఓవర్లలో 175 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరితో పాటు గ్లెన్ మ్యాక్స్వెల్ 24 బంతుల్లో 41 పరుగులు చేయగా, ప్యాట్ కమిన్స్ 14 బంతుల్లో 37 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో గ్లెన్ ఫిలిప్స్, ట్రెంట్ బౌల్ట్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.


టాస్ గెలిచిన టామ్ లాథమ్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. కివీస్ జట్టులో మార్క్ చాప్మన్ స్థానంలో జేమ్స్ నీషమ్ వచ్చాడు. ట్రావిస్ హెడ్ తిరిగి ఆస్ట్రేలియా జట్టులోకి వచ్చాడు.


డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ వచ్చినప్పటి నుంచి భారీ స్కోరు దిశగానే ఆటను ఆరంభించారు. ఆస్ట్రేలియా స్కోరు 4.1 ఓవర్లలోనే 50 పరుగులు పూర్తి చేసింది. వార్నర్, హెడ్ ఇద్దరూ టీ20 తరహాలో బ్యాటింగ్ చేశారు. ఇద్దరూ సులువుగా ఫోర్లు, సిక్సర్లు బాదారు. ఈ క్రమంలోనే డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వార్నర్ కేవలం 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఇందులో 4 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. తర్వాత హెడ్‌ కూడా 25 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. 


175 పరుగుల వరకు ఆస్ట్రేలియా దూకుడిని కివీస్ కట్టడి చేయలేకపోయింది. మరో సెంచరీ దిశగా వేగంగా ఆడుతున్న డేవిడ్ వార్నర్‌ 81 పరుగుల వద్ద అవుట్‌ అవ్వడంతో న్యూజిలాండ్‌కు తొలి బ్రేక్ వచ్చింది. వార్నర్ను గ్లెన్ ఫిలిప్స్ పెవిలియన్కు పంపాడు. వార్నర్ అవుట్ అయినా ట్రావిస్ హెడ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కేవలం 59 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఈ సెంచరీలో 10 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. దీంతో ఆస్ట్రేలియా తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన మూడో బ్యాట్స్ మన్‌గా నిలిచాడు. 


24 ఓవర్లకే ఆస్ట్రేలియా స్కోరు 200 దాటింది. ఈ ఊపు మరో భారీ స్కోరు నమోదు అవుతుందని అంతా అంచనాలు వేశారు. కానీ అక్కడి నుంచి ఆస్ట్రేలియా వికెట్ల పతనం మొదలైంది. అప్పటి వరకు దూకుడుగా బ్యాటింగ్ చేసిన ట్రావిస్ హెడ్ 67 బంతుల్లో 109 పరుగులు చేసి ఔటయ్యాడు. అతన్ని కూడా గ్లెన్ ఫిలిప్స్ ఔట్ చేశాడు.


అక్కడి నుంచి ఆస్ట్రేలియా పరుగులు వేగాన్ని కివీస్ కట్టడి చేసింది. పరుగులు ఇవ్వకుండానే వికెట్లు తీయగలిగింది. దీంతో 41 ఓవర్‌లో ఆస్ట్రేలియా తన 300 పరుగుల మార్క్‌ను దాటింది. అప్పటికే కీలకమైన ఐదు వికెట్లు కోల్పోయింది. గ్లెన్ మ్యాక్స్వెల్, ప్యాట్ కమిన్స్ ధాటిగా ఆడటంతో 388 పరుగులు చేయగలిగింది. గ్లెన్ మ్యాక్స్వెల్ 18 బంతుల్లో 40 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. అతను 45వ ఓవర్‌లో జేమ్స్ నీషమ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అయ్యాడు. 


జేమ్స్ నీషమ్ ఓవర్లో 4 సిక్సర్లు
జేమ్స్ నీషమ్ 48వ ఓవర్‌లో నాలుగు సిక్సర్లతో కలిపి మొత్తం 27 పరుగులు వచ్చాయి. అప్పటి ఆస్ట్రేలియా 18 బంతుల్లో 57 పరుగులు చేసింది. ప్యాట్ కమిన్స్ 13 బంతుల్లో 37 పరుగులు చేశాడు. భారీ స్కోర్ చేస్తుందన్న టైంలో ట్రెంట్ బౌల్ట్ 49వ ఓవర్లో అద్భుతం చేశాడు. ఈ ఓవర్లో కేవలం ఒక్క పరుగుకే మూడు వికెట్లు తీశాడు. ఈ ఓవర్లో జోష్ ఇంగ్లిస్, పాట్ కమిన్స్, ఆడమ్ జంపాను బౌల్ట్ ఔట్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ 49.2 ఓవర్ల వద్దే మిగిసింది. పది వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా  న్యూజిలాండ్‌కు 389 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది.