Asia Cup 2023:
ఆసియా క్రికెటింగ్ దేశాలు మరో అద్భుతమైన టోర్నీకి సన్నద్ధమయ్యాయి. బుధవారమే ఆసియాకప్ -2023 మొదలవుతోంది. తొలి మ్యాచులో ఆతిథ్య పాకిస్థాన్, పసికూన నేపాల్ తలపడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు అత్యంత ఉత్కంఠతో ఎదురు చూస్తున్న భారత్, పాకిస్థాన్ పోరు శనివారం జరుగుతుంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు టోర్నీ జరుగుతుంది. తొలుత లీగ్ మ్యాచులు జరుగుతాయి. సెప్టెంబర్ 6 నుంచి సూపర్ ఫోర్ దశ మొదలవుతుంది. టోర్నీ లైవ్ స్ట్రీమింగ్, జట్లు, వేళల వివరాలు మీకోసం.
Asia cup 2023 టోర్నీ ఎప్పుడు మొదలవుతుంది?
Asia cup 2023 టోర్నీ ఆగస్టు 30 నుంచి మొదలవుతుంది.
Asia cup 2023 టోర్నీ మ్యాచులు ఎక్కడ జరుగుతున్నాయి?
Asia cup 2023 టోర్నీ మ్యాచులు పాకిస్థాన్, శ్రీలంకలో జరుగుతున్నాయి.
Asia cup 2023 టోర్నీ లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్టింగ్ ఎందులో?
Asia cup 2023 టోర్నీ ప్రసార హక్కులను స్టార్ ఇండియా కైవసం చేసుకుంది. లైవ్ స్ట్రీమింగ్ హాట్‌స్టార్, లైవ్ టెలికాస్ట్ స్టార్‌స్పోర్ట్స్ చానళ్లలో వస్తుంది.
Asia cup 2023 టోర్నీ మ్యాచుల టైమింగ్ ఏంటి?
Asia cup 2023 టోర్నీ మ్యాచులు డే/నైట్ ఫార్మాట్లో జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచులు మొదలవుతాయి.
Asia cup 2023కి భారత జట్టు
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమి, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ప్రసిద్ధ్ కృష్ణ - రిజర్వు ఆటగాడు: సంజూ శాంసన్
Asia cup 2023కి పాకిస్థాన్ జట్టు
బాబర్ ఆజామ్ (కెప్టెన్), అబ్దుల్లా షఫిక్, ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హఖ్, తయ్యబ్ తాహిర్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, అఘా సల్మాన్, ఫహీమ్ అష్రఫ్, మహ్మద్ వాసిమ్ జూనియర్, మహ్మద్ హ్యారిస్, హమ్మద్ రిజ్వాన్, హ్యారిస్ రౌఫ్, నసీమ్ షా, షాహిన్ అఫ్రీది, ఉసామా మిర్