Asia Cup 2023: ఆసియా కప్ 2023 టోర్నీ ఆతిథ్యం పాకిస్థాన్ నుంచి తరలిపోనుందా! ఈ ఏడాది సీజన్ యూఏఈ వేదికగా జరగనుందా! అంటే అవుననే సమాధానం వస్తోంది. నేడు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశం జరిగింది. బీసీసీఐ కార్యదర్శి జైషా, పాక్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ నజామ్ సేథీ భేటీ అయ్యారు. అయితే వీరిద్దరి మధ్య పెద్దగా చర్చలేమీ జరగలేదని సమాచారం. దీంతో ఆసియా కప్- 2023 నిర్వహణ ఎక్కడనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
భేటీలో ఏం నిర్ణయించారంటే..
పలు నివేదికల ప్రకారం.. ఆసియా కప్- 2023 సీజన్ యూఏఈలో జరగనున్నట్లు సమాచారం. ఈ విధంగా జైషా, నజామ్ సేథీలు తమ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన విడుదల కాలేదు. మార్చిలో ప్రకటించనున్నట్లు సమాచారం. పాక్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ సేథీ తమ ఉద్దేశాన్ని జైషాతో చెప్పినట్లు నివేదికలు తెలిపాయి. 'పాక్ వేదికగా జరిగే ఆసియా కప్ లో భారత్ పాల్గొనకపోతే... భారత్ ఆతిథ్యం ఇచ్చే వన్డే ప్రపంచకప్ లో తమ జట్టు పాల్గొనదు' అనే విషయాన్ని నజామ్ సేథీ జైషా దృష్టికి తీసుకెళ్లినట్లు కథనాలు పేర్కొన్నాయి. ఇదే విషయాన్ని పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్ రజా కూడా చెప్పారు.
అయితే ఈ ఏడాది ఆసియా కప్ యూఏఈలోనే జరగనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే పాక్ ఆతిథ్యం ఇస్తే భారత్ ఆడదని ఇప్పటికే జైషా అన్నారు. ఒకవేళ టీమిండియా ఆడకపోతే ఆసియా కప్ వెలవెలబోతుంది. పాక్- భారత్ మ్యాచ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. అలాగే ఆదాయం కూడా బాగా వస్తుంది. కాబట్టి భారత్ లేకుండా ఆసియా కప్ నిర్వహించడం అసాధ్యమే. అయితే భారత్ ఆడాలంటే వేదిక మార్చడం అనివార్యం. కాబట్టి భారత్ ఏ నిర్ణయం తీసుకున్నా పాక్ అనుసరించాల్సిందేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
50 ఓవర్ల ఫార్మాట్ లో మ్యాచ్ లు
2023లో 50 ఓవర్ల ప్రపంచ కప్ ఉంటుంది కాబట్టి ఆసియా కప్ టోర్నమెంట్ కూడా 50 ఓవర్ల ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 2018లో కూడా ఆసియా కప్పును 50 ఓవర్ల ఫార్మాట్ లో నిర్వహించారు. కొవిడ్-19 కారణంగా 2020 లో జరగాల్సిన ఆసియా కప్ రద్దుచేశారు.

According to reports, Asia Cup 2023 is likely to be moved to UAE from Pakistan. Your views on this move?#India #Pakistan #INDvsPAK #AsiaCup #CricTracker pic.twitter.com/fHjROysLBZ
— CricTracker (@Cricketracker) February 4, 2023