Jonny Bairstow Dismissal: లార్డ్స్ టెస్టులో   ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో రనౌట్ వివాదంతో ట్విటర్ లో చర్చ వాడీవేడిగా సాగుతోంది. నిత్యం ఇతర జట్లను స్లెడ్జ్ చేస్తూ.. తొండీల ఆటలు ఆడే  ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా తమ వరకు వచ్చేసరికి మాత్రం ‘క్రీడా స్ఫూర్తి’అని గగ్గోలు పెడుతున్నాయి. అయితే  ఇదే క్రమంలో  సామాజిక మాధ్యమాలలో  బెయిర్ స్టో ఔట్ అయిన తీరుపై  మీమ్స్  మాత్రం థౌజెండ్ వాలాలా పేలుతున్నాయి.


ఏదైనా  ఒక రంగంలోని సెలబ్రిటీకి సంబంధించి ఏదైనా ఘటన  జరిగితే   ఇటీవల కాలంలో  పోలీసు డిపార్ట్మెంట్ వాటిపై ఆసక్తికర ట్వీట్స్ తో  జనాలను ఆకర్షిస్తున్నది.  ఐపీఎల్ లో  కొద్దిపాటి తేడాతో రనౌట్స్ అయినప్పుడు లక్నో, ముంబై పోలీసుల తమ అధికారిక ట్విటర్ ఖాతాలో ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసి  జనాలలో అవగాహన పెంచిన విషయం తెలిసిందే. తాజాగా  బెయిర్ స్టో  వివాదాస్పద రనౌట్ ను ఆస్ట్రేలియా లోని  విక్టోరియా పోలీసులు వినూత్న రీతిలో వాడుకున్నారు. 


 






బెయిర్ స్టో రనౌట్ అయిన ఫోటోను షేర్ చేస్తూ.. ‘మేం  జానీ బెయిర్ స్టో కు థ్యాంక్స్ చెబుతున్నాం. గ్రీన్ లైన్ పడటానికంటే ముందే  గీత దాటితే  ఏమవుద్దోననే విషయాన్ని  అతడు క్లీయర్ గా చెప్పాడు.  రోడ్డు భద్రతను ఇలా పాటించండి..’ అంటూ  వాటి లింక్ ను షేర్ చేసింది.  ఈ ట్వీట్  నెట్టింట పోస్టు చేసిన కొద్దిసేపటికే   నెట్టింట వైరల్ అయింది.  


 






ఇదే టెస్టులో బెయిర్ స్టో.. మొదటిరోజు ‘జస్ట్ స్టాప్ ఆయిల్’   కార్యకర్తను ఎత్తిపడేసిన వీడియోను షేర్ చేస్తూ.. ఔట్ అయిన తర్వాత బెయిర్ స్టో థర్డ్ అంపైర్ దగ్గరకు వెళ్లి అక్కడ అంపైర్ ను అమాంతం ఎత్తిపడేసినట్టుగా  కూడా ఓ వీడియో వైరల్ అయింది. ఆస్ట్రేలియా డ్రెస్సింగ్ రూమ్ లో కూడా ఇదేవిధంగా  ఆసీస్  ప్లేయర్లను ఇదే విధంగా తుక్కుతక్కుకింద బాదినట్టుగా వీడియో వైరల్ అవుతున్నది.  ఈ  వీడియోలు నెటిజన్లకు నవ్వులు పూయిస్తున్నాయి. 


 






 








Join Us on Telegram: https://t.me/abpdesamofficial