బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ 199 పరుగుల వద్ద అవుటయ్యాడు. దీంతో కేవలం ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్సయ్యాడు. తన ఖాతాలో ఇప్పటికే ఒక డబుల్ సెంచరీ ఉంది. ఇంకొక్క పరుగు చేసి ఉంటే దానికి మరో డబుల్ సెంచరీ జతయ్యేది.
శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మధ్య రెండు టెస్టుల సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్ మొదటి మ్యాచ్‌లో ఈ ఫీట్ నమోదయింది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు మొత్తం 12 మంది బ్యాటర్లు 199 స్కోరు వద్ద అవుటయ్యారు. వారిలో భారత బ్యాటర్లు కేఎల్ రాహుల్, అజారుద్దీన్ కూడా ఉన్నారు. 1997లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో సనత్ జయసూర్య తర్వాత 199 మీద అవుటైన శ్రీలంక బ్యాటర్ ఏంజెలో మాథ్యూసే.
టెస్టుల్లో 199 పరుగుల వద్ద అవుటైన బ్యాటర్లు వీరే...
1. ముదస్సర్ నాజర్ (పాకిస్తాన్) - 1984లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో
2. మహ్మద్ అజారుద్దీన్ (భారత్) - 1986లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో
3. మాథ్యూ ఇలియట్ (ఆస్ట్రేలియా) - 1997లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో
4. సనత్ జయసూర్య (శ్రీలంక) - 1997లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో
5. స్టీవ్ వా (ఆస్ట్రేలియా) - 1999లో వెస్టిండీస్ జరిగిన మ్యాచ్‌లో
6. యూనిస్ ఖాన్ (పాకిస్తాన్) - 2006లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో
7. ఇయాన్ బెల్ (ఇంగ్లండ్) - 2008లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో
8. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) - 2015లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో
9. కేఎల్ రాహుల్ (ఇండియా) - 2016లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో
10. డీన్ ఎడ్గర్ (దక్షిణాఫ్రికా) - 2020లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో
11. ఫాఫ్ డుఫ్లెసిస్ (దక్షిణాఫ్రికా) - 2020లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో
12. ఏంజెలో మాథ్యూస్ (శ్రీలంక) - 2022 బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో