Asia Cup 2023: ఎన్నో అవంతరాలు, మరెన్నో అడ్డంకులు, చర్చోపచర్చలు,  హెచ్చరికలను దాటుకుని అసలు ఉంటుందా..? లేదా..? అన్న మీమాంసల నడుమ ఎట్టకేలకు ఆసియా కప్ బుధవారం (ఆగస్టు 30)  పాకిస్తాన్‌లోని ముల్తాన్ వేదికగా ప్రారంభమయ్యేందుకు సిద్ధమైంది. భద్రతా కారణాలతో భారత్.. పాకిస్తాన్‌కు వచ్చేది లేదని  అభ్యంతరం చెప్పడం, తటస్థ వేదికలకు  దాయాది దేశం కూడా  ససేమిరా ఒప్పుకోకపోవడంతో టోర్నీ చరిత్రలోనే తొలిసారి రెండు దేశాలలో ఆసియా కప్ జరుగనుంది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్‌కు ముందు రిహార్సల్స్‌లా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో గెలిచి ప్రపంచకప్ సమరంలో ఉత్సాహంతో ముందడుగు వేయాలని ప్రధాన జట్లు భావిస్తున్నాయి. ఆసియా కప్‌కు ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్.. బుధవారం నేపాల్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో ఈ టోర్నీలో పాల్గొనబోయే జట్లు, షెడ్యూల్, మ్యాచ్ వేదికలు, లైవ్ టెలికాస్ట్ వివరాలు మీకోసం.. 


రెండు గ్రూప్‌లు


బుధవారం నుంచి తెర లేవనున్న ఈ మెగా టోర్నీ వన్డే ఫార్మాట్‌లో జరుగనుంది.  14వ ఆసియా కప్‌లో ఐదు శాశ్వత సభ్య దేశాలతో పాటు ఈసారి ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్వహించిన  2023 ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్‌లో నేపాల్ గెలిచి ఈ టోర్నీకి అర్హత సాధించింది. భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, నేపాల్‌లు ఆసియా కప్‌లో ఆడనున్నాయి. గ్రూప్ - ఎ లో పాకిస్తాన్, ఇండియా, నేపాల్ ఉండగా.. గ్రూప్ - బీ లో  శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ ఉన్నాయి. 


నాలుగు వేదికలు.. 


ఆగస్టు 30 నుంచి జరుగబోయే ఆసియా కప్‌ నాలుగు వేదికల్లో జరుగనుంది. పాకిస్తాన్‌లోని  లాహోర్, ముల్తాన్‌ తో పాటు శ్రీలంకలోని  క్యాండీ, కొలంబోలలో మ్యాచ్ ‌లు జరుగుతాయి. పాకిస్తాన్‌లో నాలుగు, శ్రీలంకలో 9 (మొత్తం 13) మ్యాచ్‌లు జరగాల్సి ఉంది.  గ్రూప్ స్టేజ్‌లో భాగంగా  మ్యాచ్‌లు పాక్, లంకలలో జరుగుతాయి. సూపర్ - 4లో ఒక మ్యాచ్ లాహోర్‌లోని గడాఫీ స్టేడియం జరిగిన తర్వాత టోర్నీ మొత్తంగా  శ్రీలంకకు షిఫ్ట్ అవుతుంది. ఫైనల్ కొలంబోలో సెప్టెంబర్ 15న జరుగుతుంది. 


 






మ్యాచ్ టైమింగ్స్..


ఆసియా కప్ మ్యాచ్‌లు అన్నీ డే అండ్ నైట్ ఫార్మాట్‌లోనే జరుగనున్నాయి. భారత కాలమానం  ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి మ్యాచ్‌లు జరుగుతాయి.  గ్రూప్ స్టేజ్‌లో భాగంగా భారత్.. పాకిస్తాన్, నేపాల్‌తో ఆడబోయే మ్యాచ్‌లు మధ్యాహ్నం 3 గంటలు మొదలవుతాయి.  


లైవ్ చూడటమిలా.. 


ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు  అధికారిక ప్రసారదారు  స్టార్ (హాట్‌స్టార్) టీవీ దక్కించుకుంది.  ఈ మ్యాచ్‌లను  స్టార్  హిందీ, ఇంగ్లీష్‌తో పాటు  ప్రాంతీయ భాషల్లో కూడా ప్రసారం చేయనుంది.  డిస్నీ హాట్‌స్టార్ యాప్‌లో ఎలాంటి రుసుము లేకుండా (ఫ్రీ గా)నే మ్యాచ్‌లను చూడొచ్చు. 


 






జట్లు : 


ఇండియా : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య (వైస్‌ కెప్టెన్‌), రవీంద్ర జడేజా, జస్ప్రీత్‌ బుమ్రా, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, మహ్మద్‌ షమి, ఇషాన్‌ కిషన్‌, శార్దూల్ ఠాకూర్‌, అక్షర్‌ పటేల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, ప్రసిద్ధ్‌ కృష్ణ - రిజర్వు ఆటగాడు: సంజూ శాంసన్‌


పాకిస్తాన్ : బాబర్ ఆజమ్ (కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అలి అఘా, ఇఫ్తికార్ అహ్మద్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ హరీస్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఉస్మాన్ మీర్, ఫహీమ్ అష్రఫ్, హరీస్ రౌఫ్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, షాహీన్ అఫ్రిది, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్ (ట్రావెలింగ్ రిజర్వ్) 


బంగ్లాదేశ్ : షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిటన్ దాస్, తాంజిద్ తమీమ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహీద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మెహదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, నస్ మహ్మద్, హసన్ మహమూద్, హసన్ మహమూద్ హుస్సేన్, అఫీఫ్ హుస్సేన్, షోర్ఫుల్ ఇస్లాం, అబాదోత్ హుస్సేన్, నయీమ్ షేక్


అఫ్గానిస్తాన్ : హష్మతుల్లా షాహిది (కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్, ఇక్రమ్ అలిఖిల్, ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహమత్ షా, నజిబుల్లా జద్రాన్, మహ్మద్ నబి, కరీమ్ జనత్, గుల్బాదిన్ నైబ్, రషీద్ ఖాన్, అబ్దుల్ రహమాన్, షరాపుద్దీన్ అష్రాఫ్, ముజీబుర్ రెహ్మాన్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీం సఫి, ఫజల్ హక్ ఫరూఖీ 


నేపాల్ : రోహిత్ కుమార్ పౌడెల్ (కెప్టెన్), మహమ్మద్ ఆసిఫ్ షేక్, కుశాల్ భుర్టెల్, లలిత్ నారాయణ్ రాజ్‌బన్షి, భీమ్ సర్కి, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీ, సందీప్ లామిచానే, కరణ్ కెసి, గుల్షన్ కుమార్ ఝా, ఆరిఫ్ షేక్, సోంపాల్ కమీ , ప్రతిస్, కిషోర్ మహ్తో, సందీప్ జోరా, అర్జున్ సౌద్, శ్యామ్ ధాకల్


శ్రీలంక :  దసున్ శనక (కెప్టెన్), పతుమ్ నిస్సంక, దిముత్ కరుణరత్నె, కుశాల్ పెరెరా, కుశాల్ మెండిస్, చరిత్ అసలంక, సదీర సమరవిక్రమ, ధనంజయ డిసిల్వ, దుశన్ హేమంత, దునిత్ వెల్లలగె, మహీశ్ తీక్షణ, ప్రమోద్ మధుశాన్, కసున్ రజిత, దిల్షాన్ మధుశంక, మతీశ పతిరాన 
(శ్రీలంక జట్టుకు ఇంకా  అక్కడి క్రీడా శాఖ ఆమోదముద్ర వేయలేదు. దీంతో అధికారికంగా ఆ జట్టు  ప్రకటన నేటి రాత్రి వెలువడే అవకాశముంది)















ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial