Abhishek Sharma News: ఇండియన్ విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ.. తాజా ఐసీసీ టీ20 ర్యాంకుల్లో సత్తా చాటాగు. తను ఏకంగా 38 ప్లేసులు ఎగబాకి కెరీర్ బెస్ట్ రెండో ర్యాంకు సాధించాడు. ముంబైలో ఆదివారం జరిగిన ఐదో టీ20లో తను రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. 54 బంతుల్లోనే 7 ఫోర్లు, 13 సిక్సర్లతో 135 పరుగులు చేశాడు. దీంతో ఈ ఫార్మాట్లలో అత్యధిక పరుగులు, ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ప్లేయర్ గా నిలిచాడు. అభిషేక్ ఇన్నింగ్స్ తో ఇండియా సిరీస్ ను 4-1తో కైవసం చేసుకుంది. తెలుగు కుర్రాడు, తిలక్ వర్మ ఒక స్థానం దిగజారాడు. గత రెండు టీ20ల్లో తను విఫలం కావడంతో ఒక ర్యాంకు కోల్పోయి, మూడో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ టాప్ ప్లేస్ లో నిలిచాడు. భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఐదో ర్యాంకు దక్కించుకున్నాడు. 






సత్తా చాటిన వరుణ్..
5 టీ20ల సిరీస్ లో 14 వికెట్లతో సత్తా చాటిన భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఏకంగా రెండో ర్యాంకును దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ తో సిరీస్ లో తను సత్తా చాటి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచాడు. ఆదిల్ రషీద్ కూడా రెండో స్థానానికి పడిపోయాడు. మరోవైపు రవి బిష్ణోయ్ నాలుగు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంకు దక్కించుకున్నాడు. అర్షదీప్ సింగ్ టాప్-9లో నిలిచాడు. వెస్టిండీస్ స్పిన్నర్ అఖీల్ హుస్సేన్ టాప్ ర్యాంకు దక్కించుకున్నాడు. ఇక శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో సత్తా చాటిన ఆసీస్ బ్యాటర్లు తాజా టెస్టు ర్యాంకుల్లో తమ స్థానాలను మెరుగు పర్చుకున్నారు. సెంచరీ చేసిన స్టాండిన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మూడు స్థానాలు ఎగబాకి ఐదో ర్యాంకు దక్కించుకున్నాడు. భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ నాలుగో ర్యాంకులోనే కొనసాగతున్నాడు. బౌలర్ల విభాగంలో జస్ప్రీత్ బుమ్రా తన టాప్ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. గతేడాదికి సంబంధించి ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, ఐసీసీ పురుషుల క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ తను నిలిచిన సంగతి తెలిసిందే. భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పదో ర్యాంకు దక్కించుకున్నాడు. 


వరుణ్ ని కచ్చితంగా ఆడించాల్సిందే..
మిస్టరీ స్పిన్నర్ వరుణ్‌ చక్రవర్తి ని వన్డేల్లోకి తీసుకోవడం మంచి నిర్ణయమని భారత మాజీ క్రికెటర్  ఆకాశ్ చోప్రా ప్రశంసించాడు. అయితే, అతడిని బెంచ్‌కే పరిమితం చేయొద్దని సూచించాడు. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ కు అతడిని చివరి క్షణంలో వన్డే సిరీస్‌కు మేనేజ్‌మెంట్ తీసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహకంగా ఉన్న ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రాణిస్తే ఐసీసీ టోర్నీలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయంగానే కనిపిస్తోంది.  వరుణ్‌ చక్రవర్తి ఎంపిక అద్భుతమని, జట్టు విజయాల్లో ఫింగర్‌ స్పిన్నర్ల అవసరం ఉండదనీ, మణికట్టు మాంత్రికులే పెద్ద పాత్ర అని పేర్కొన్నాడు. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సెలక్టర్లు అతడిని ఎంపిక చేయలేదని, ఇప్పుడు వన్డేల్లోకి తీసుకున్నారని, అతడి ఫామ్‌ను ఉపయోగించుకోవానుకోవడం సరైన నిర్ణయమని ప్రశంసించాడు. అయితే, అతడిని బెంచ్‌కే పరిమితం చేయొద్దని , ప్రతి మ్యాచ్‌లోనూ ఆడించాలని టీమ్ మేనేజ్మెంట్ కు సూచించాడు. గురువారం నుంచి ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది. 


Also Read: Rahul Dravid Accident: ఆటో డ్రైవర్ తో గొడవ పడిన ద్రవిడ్.. క్రెడ్ యాడ్ మాదిరిగానే నిజ జీవితంలో..