Rahul Dravid News: క్రెడ్ అనే క్రెడిట్ కార్డు యాడ్ లో భారత మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరలైంది. రోడ్డుపై ఉండగా, తనకు ఒక వ్యక్తి డాష్ కొడితే ద్రవిడ్ తన కూల్ నెస్ కోల్పోయి ఫైట్ చేసే సన్నివేశం అందులో ఉంటుంది. మిస్టర్ కూల్ అని పేరుపొందిన ద్రవిడ్ లోని మరో నేచర్ ను ఆ యాడ్ మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. అయితే నిజ జీవితంలో యాడ్ లో పేర్కొన్న మాదిరిగానే ద్రవిడ్ కి ఒక యాక్సిండెంట్ ఘటన ఎదురైంది.


తాజాగా బెంగళూరులో రోడ్డుపై వెళుతుండగా ఒక గూడ్సు ఆటో వచ్చి, ద్రవిడ్ కారును ఢీకొట్టింది. దీంతో ఆ ఆటో డ్రైవర్ తో ద్రవిడ్ సంవాదానికి దిగాడు. క్రెడ్ యాడ్ లో పేర్కొన్నట్లుగా కాకుండా, కాస్త హంబుల్ గానే ఈ వివాదం చెలరేగింది. తాజాగా దీనికి సంబంధించిన క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరలైంది. అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తూ, లైకులు, షేర్లు చేస్తున్నారు. 






ఫోన్ నెంబర్ తీసుకుని..
ఇక ఈ ఘటన జరుగినప్పుడు కారును ఎవరు డ్రైవ్ చేశారో సమాచారం లేదు. అయితే వివాదం అనంతరం ఆటో డ్రైవర్ ఫోన్ నెంబర్, ఆటో నెంబర్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. సాయంత్ర ఆరున్నర గంటలకు నమోదైన ఈ సంఘటనకు సంబంధించి ఎలాంటి పోలీసు కేసు నమోదు కాలేదుని సమాచారం. ఇక గతేడాది భారత హెడ్ కోచ్ గా టీ20 ప్రపంచకప్ ను ద్రవిడ్ నాయకత్వంలోనే టీమిండయా సాధించింది. ఆ తర్వాత తను పదవి నుంచి వైదొలిగాడు. తాజాగా ఐపీఎల్ లో తాను ఆడిన ప్రాంచైజీ, మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ గా నియమితులయ్యాడు. గతేడాది జరిగిన మెగా వేలంలోనూ ద్రవిడ్.. రాజస్థాన్ తరపున పాల్గొన్నాడు. 13 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని కొనుగోలు చేయడంలో ద్రవిడ్ కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. 


2007లో టీమిండియా కెప్టెన్ గా..
భారత దిగ్గజ క్రికెటర్లలో ద్రవిడ్ ఒకరు. టీమిండియా తరపున 24వేలకు పైగా అంతర్జాతీయ పరుగులు సాధించాడు. తన కెరీర్లో మూడు ఫార్మాట్లను ఆడాడు. 164 టెస్టుల్లో 13288 పరుగులు సాధించిన ద్రవిడ్.. 52.31 సగటును కలిగి ఉన్నాడు. అలాగే 36 సెంచరీలు, 63 అర్థ సెంచరీలు చేశాడు. 344 వన్డేలు ఆడిన ద్రవిడ్.. 10889 పరుగులు, 12 సెంచరీలు, 83 అర్థ సెంచరీలు చేశాడు. ఇక ఒకే ఒక టీ20ఐ ఆడిన ద్రవిడ్ అందులో 31 పరుగులు చేశాడు. వన్డేలు, టెస్టుల్లో పదివేల పరుగుల మార్కును దాటిన అతికొద్ది మంది క్రికెటర్లలో ద్రవిడ్ ఒకరు. ఇక 2007 వన్డే ప్రపంచకప్ లో టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ టోర్నీలో దారుణ ప్రదర్శనతో భారత్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఆ తర్వాత పరిణామాలతోనే ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ లీగ్ ఐపీఎల్ కు అంకురార్పణ జరిగిందని విశ్లేషకులు పేర్కొంటారు. 


Also Read: Rashid World Record: రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు.. టీ20ల్లో లీడింగ్ వికెట్ టేకర్ గా ఘనత