భారత క్రికెట్ జట్టు, నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో కొన్ని ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లను బీసీసీఐ విడుదల చేసింది. ఆసక్తి ఉన్నవారిని దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరింది. ఈ కింద పేర్కొన్న స్థానాలకు బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది.


1. హెడ్ కోచ్ (టీమ్ ఇండియా - సీనియర్ మెన్)
2. బ్యాటింగ్ కోచ్ (టీమ్ ఇండియా - సీనియర్ మెన్)
3. బౌలింగ్ కోచ్ (టీమ్ ఇండియా - సీనియర్ మెన్)
4. ఫీల్డింగ్ కోచ్ (టీమ్ ఇండియా - సీనియర్ మెన్)
5. హెడ్ స్పోర్ట్స్ సైన్స్/మెడిసిన్ విత్ నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)


టీం ఇండియా హెడ్ కోచ్‌కు సంబంధించి అక్టోబర్ 26వ తేదీన సాయంత్రం ఐదు గంటల కల్లా దరఖాస్తు చేసుకోవాలి. headcoach@bcci.tv మెయిల్ ఐడీకి మీ దరఖాస్తును పంపించాలి. మిగతా స్థానాలన్నిటికీ నవంబర్ 3వ తేదీన సాయంత్రం ఐదు గంటల కల్లా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


Also Read: టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఇదే.. ఈ ఐపీఎల్‌లో ఎంతమంది హిట్ అయ్యారో తెలుసా?


బ్యాటింగ్ కోచ్ స్థానానికి battingcoach@bcci.tv మెయిల్ ఐడీకి, బౌలింగ్ కోచ్ స్థానానికి bowlingcoach@bcci.tv, ఫీల్డింగ్ కోచ్ స్థానానికి fieldingcoach@bcci.tv‌, హెడ్ స్పోర్ట్స్ సైన్స్/మెడిసిన్ విత్ నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) స్థానానికి sportsscienceandmedicine@bcci.tv మెయిల్ ఐడీకి మీ దరఖాస్తులను మెయిల్ చేయాల్సి ఉంటుంది.


హెడ్ కోచ్ (టీమ్ ఇండియా - సీనియర్ మెన్), బ్యాటింగ్ కోచ్ (టీమ్ ఇండియా - సీనియర్ మెన్), బౌలింగ్ కోచ్ (టీమ్ ఇండియా - సీనియర్ మెన్), ఫీల్డింగ్ కోచ్ (టీమ్ ఇండియా - సీనియర్ మెన్), హెడ్ స్పోర్ట్స్ సైన్స్/మెడిసిన్ విత్ నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) దరఖాస్తులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






Also Read: ధోనీసేనకు అభినందనలు చెప్పినట్టే చెప్పి.. పంచ్ వేసిన గౌతమ్‌ గంభీర్‌


Also Read: ఐపీఎల్‌ ఫైనల్‌ ముందు ధోనీ నేర్పిన వ్యాపార పాఠమిది! ప్రశంసించిన ఆనంద్‌ మహీంద్రా


Also Read: ఈ సీజన్ లో అసలైన విజేత కోల్ కతా... ఐపీఎల్ సెకండ్ పార్ట్ లో ఆ జట్టు గొప్పగా ఆడింది... సీఎస్కే కెప్టెన్ ధోనీ కామెంట్స్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి