Nz Vs Ban 1st Test Bangladesh Defeat New Zealand: పసికూన అనే పేరును చెరిపేసుకున్న బంగ్లాదేశ్ జట్టు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తూ సరికొత్త చరిత్ర లిఖించుకుంది. గతేడాది టెస్టుల్లో వరుస పరాజయాలతో చతికిలబడిన బంగ్లాదేశ్ తాజాగా టెస్టు ఛాంపియన్‌ న్యూజిలాండ్ జట్టును మట్టికరిపించింది. ఓవల్‌లోని మౌంట్ మాంగనీలో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టుపై బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 10 ఏళ్ల తరువాత కివీస్‌ను వారి గడ్డపై ఓడించిన తొలి ఆసియా జట్టుగా బంగ్లాదేశ్ నిలిచింది. 


గత పది సంవత్సరాల నుంచి కివీస్ గడ్డపై ఆ జట్టును ఏ ఆసియా జట్టు ఓడించలేదు. తాజాగా ఆ చరిత్రను బంగ్లాదేశ్ తిరగరాస్తూ న్యూజిలాండ్‌పై టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించింది. కివీస్‌ గడ్డపై 16 ఓటముల తర్వాత బంగ్లా టీమ్ గెలిచింది. ఆట ఐదవరోజు తమ కివీస్ 147/5 గా ఉన్న కివీస్ మరో 22 పరుగులకే చివరి 5 వికెట్లు కోల్పోయింది. విజయానికి కేవలం 40 పరుగులు అవసరం కావడంతో బంగ్లాదేశ్ 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. 







బంగ్లాదేశ్‌కు అన్ని ఫార్మాట్లలో కలిపి కివీస్‌పై ఇదే తొలి గెలుపు. గతంలో ఆడిన 32 మ్యాచ్‌లలో న్యూజిలాండ్ దే పైచేయి. తాజా విజయంతో బంగ్లా ఆటగాళ్లలో నూతనోత్సాహం కనిపిస్తోంది. తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిన్ నెగ్గిన కివీస్‌ను బంగ్లాదేశ్ ఓడించడాన్ని అన్ని దేశాల క్రికెట్ జట్లు స్వాగతిస్తున్నాయి. చివరిసారిగా హామిల్టన్ వేదికగా 2011 జనవరిలో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్‌ను ఓడించింది. ఆ తరువాత కివీస్‌ను వారి గడ్డ మీద ఓడించిన ఆసియా జట్టుగా బంగ్లాదేశ్ నిలిచింది.







Also Read: WHO On Omicron: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. మరిన్ని ప్రమాదకర వేరియంట్లు పుట్టుకొస్తాయని డబ్ల్యూహెచ్‌ఓ వార్నింగ్..!


Also Read: Ranji Trophy Postpone: ఆటగాళ్లకు కరోనా ఎఫెక్ట్.. రంజీ ట్రోఫీ వాయిదా వేసిన బీసీసీఐ


Also Read: Bengal Team Covid Positive: శివమ్‌ దూబె, బెంగాల్‌ రంజీ క్రికెటర్లలో ఏడుగురికి కరోనా 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి