భారత్- పాకిస్థాన్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అని అడిగిన పాక్ అభిమాని మోమిన్ సాకిబ్ ను.. టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ ట్రోల్ చేశాడు. మోమిన్ సాకిబ్ టీ20 ప్రపంచకప్- 2019 నుంచి మారో ముఝే మారో అనే వీడియోతో వైరల్ అయ్యాడు. ఆసియా కప్ లీగ్ మ్యాచ్ లో పాక్ పై భారత్ విజయం సాధించింది. దీని గురించి ప్రస్తావిస్తూ.. ఈరోజు మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అని మోమిన్ పఠాన్ ను అడిగాడు. దానికి లీగ్ మ్యాచ్ ఫలితమే పునరావృతమవుతుంది అని ఇర్ఫాన్ బదులిచ్చాడు.
అదే ఫలితమంటూ కౌంటర్
దానిని తప్పుగా అర్థం చేసుకున్నమోమిన్.. టీ20 ప్రపంచకప్ 2019 ఫలితం పునరావృతమవుతుందా అని ఇర్ఫాన్ ను అడిగాడు. ఆ మ్యాచ్ లో పాకిస్థాన్ టీమిండియాపై 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. దానికి పఠాన్ నవ్వుతూ ఇలా బదులిచ్చాడు. అదొక దురదృష్టకర ఓటమి అని చెప్పాడు. ఆ పరాజయం తర్వాత భారత ఆటగాళ్లు తిరిగి ఫాంలోకి వచ్చారని.. ఆ ఫలితం పునరావృతం కాదని స్పష్టంచేశాడు.
ఆసియా కప్ లీగ్ మ్యాచులో పాక్ పై భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజాలు అద్భుత బ్యాటింగ్ తో టీమిండియాను గెలిపించారు. మళ్లీ అదే ఫలితం పునరావృతమవ్వాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. అయితే మోకాలి గాయంతో జడేజా ఈ టోర్నీకి దూరమయ్యాడు. పాక్ తో మ్యాచులో భారత్ జట్టులో పలు మార్పులు జరిగే అవకాశం ఉంది.
టీమిండియా ఓటమి
ఆసియా కప్‌లో భారత్‌పై పాకిస్తాన్ పగ తీర్చుకుంది. సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియాపై ఐదు వికెట్లతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. అనంతరం పాకిస్తాన్ 19.5 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. మహ్మద్ నవాజ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.