హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 2022 -23 ఏడాదికి వివిధ సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్ ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా మొత్తం 42 కోర్సుల్లో పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పించనున్నారు. మొత్తం 281 సీట్లలో ప్రవేశాలు కల్పించనున్నారు. వీటిలో జనరల్ అభ్యర్థులకు 99 సీట్లు, ఎస్సీ అభ్యర్థులకు 43 సీట్లు, ఎస్టీ అభ్యర్థులకు 21 సీట్లు, ఓబీసీ అభ్యర్థులకు 76 సీట్లు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 28 సీట్లు, దివ్యాంగులకు 14 సీట్లు కేటాయించారు.
వివరాలు...
* పీహెచ్‌డీ ప్రోగ్రామ్
సబ్జెక్టులు: అప్లైడ్ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, ఎలక్ర్టానిక్స్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, కెమిస్ర్టీ, బయోకెమిస్ర్టీ, ప్లాంట్ సైన్సెస్, మైక్రోబయాలజీ, యానిమల్ బయాలజీ, బయోటెక్నాలజీ, ఫిలాసఫీ, హిందీ, ఉర్దూ, అప్లైడ్ లింగ్విస్టిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, ఎడ్యుకేషన్, రీజనల్ స్టడీస్, జెండర్ స్టడీస్, ఎకనామిక్స్, డ్యాన్స్, ఆర్ట్ హిస్టరీ అండ్ విజువల్ స్టడీస్, కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్ స్టడీస్, హెల్త్ సైన్సెస్: పబ్లిక్ హెల్త్, ఆప్టోమెట్రి, నర్సింగ్, బయోమెడికల్ సైన్సెస్, సైకాలజీ, కాగ్నిటివ్ సైన్స్, మెటీరియల్స్ ఇంజినీరింగ్, నానోసైన్స్ అండ్ టెక్నాలజీ.
అర్హత: 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. జేఆర్ఎఫ్ అర్హత పొందిన వారికి ప్రవేశ పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులు రూ.600, ఈడబ్ల్యూఎస్ రూ.550, ఓబీసీ రూ.400, ఎస్సీ-ఎస్టీ, దివ్యాంగులు రూ.275 చెల్లించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.08.2022.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.09.2022.
* పరీక్ష తేదీ: అక్టోబర్, 2022.
Also Read:
BRAOU: అంబేడ్కర్ వర్సిటీ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును అధికారులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబరు 15 వరకు అడ్మిషన్లకు అవకాశం కల్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికే ఒకసారి దరఖాస్తు గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే అభ్యర్థులు అభ్యర్థన మేరకు ప్రవేశ దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
UPSC: సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు వచ్చేశాయ్, పరీక్షలు ఎప్పుడంటే?
సివిల్ సర్వీసెస్ మెయిన్స్ 2022 పరీక్షల హాల్‌టికెట్లను యూపీఎస్సీ విడుదల చేసింది. యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్ పరీక్ష కోసం తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన 11,845 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు హాజరుకానున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..